TSRTC strike: RTC workers apologize to telanganites ముక్కు నేలకు రాసి.. ఆర్టీసీ కార్మికుల క్షమాపణలు..

Tsrtc strike protest continues rtc workers apologize to telanganites

TSRTC Workers, High Court, workers apology, RTC employees apologize, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

TSRTC Workers apologize the people of the state for their campaign before the elections in favour of the Ruling TRS Party. Hence they apologize by rubbing the Nose On ground.

టీఎస్ఆర్టీసీ సమ్మె: ముక్కు నేలకు రాసి.. కార్మికుల క్షమాపణలు..

Posted: 10/30/2019 12:30 PM IST
Tsrtc strike protest continues rtc workers apologize to telanganites

దేశంలో 29వ రాష్ట్రంగా అవిర్భవించిన తెలంగాణలో మరో మారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని, ఆ పార్టీ గుర్తు కారును.. ఆ పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును గెలిపించి తాము తప్పుచేశామని ఆర్టీసీ కార్మికులు నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. ఇందుకు తమను క్షమించాలని తెలంగాణ ప్రజానికాన్ని కోరిన కార్మికులు ముక్కు నేలకు రాసి పరిహారం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమం ఉదృతంగా సాగడానికి తాము కూడా సకల జనుల సమ్మెలో పాల్గొనడం ద్వారానే సాధ్యమైందని.. దానిని ఇప్పుడు అధికారదర్ఫంతో కేసీఆర్ విస్మరిస్తున్నారని వారు విరుచుకుపడ్డారు.

బంగారు తెలంగాణలో కార్మికుల హక్కులను కాలరాసే అధికారం కేసీఆర్ కు ఎవరు ఇచ్చారని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తీరుకు నిరసనగా కార్మికులు నిరసనలు తెలిపారు. తప్పైంది మన్నించండీ అంటూ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు కోరారు. అంతలా తప్పైందని క్షమాపణలు చెప్పాల్సిన అవసరమేంటి.? అంటే.. తెలంగాణలో మరోమారు టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాము చేసిన ప్రచారానికని తెల్చి చెబుతున్నారు. బంగారు తెలంగాణ వస్తుందంటే.. నిజమేనని భావించి.. ఓట్లు అడిగామని చెప్పిన కార్మికులు.. తమ అప్పటి ప్రచారం పట్ల ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నారు.

అయితే వరుసగా రెండోసారి అధికారం చేపట్టగానే ముఖ్యమంత్రికి తాను దొరనన్న విషయం గుర్తుకువచ్చిందంటూ విమర్శలు చేసిన అర్టీసీ కార్మికులు.. మన్నించు దొరా.. అంటూ వెరైటీ ఆందోళన నిర్వహించారు. నీకు ఓటేసి మహాపాపం చేశాం అంటూ ముక్కు నేలకు రాశారు. కులమతాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికుల ఈ వినూత్న నిరసనలో పాల్గొన్నారు. తమ న్యాయమైన హక్కుల సాధనకోసం సమ్మె చేస్తుంటే కనీసం స్పందించని ముఖ్యమంత్రి.. హుజూర్ నగర్ ఉపఎన్నికల తరువాత మీడియా ముందుకు వచ్చి.. ఆర్టీసీ మునిగిపోతుందని వ్యాఖ్యలు చేయడం.. ప్రజా రవాణా నష్టాల బాటపడితే ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించాలన్న విషయం కూడా తెలియదా.? అంటూ కార్మికులు ఫైర్ అవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  High Court  Ashwathama Reddy  RTC Employees  apology  CM KCR  TRS Government  TSRTC Strike  Telangana  

Other Articles