Moderate rain, thunderstorm likely in Telugu States రానున్న 24 గంటల్లో.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

Cyclone maha subsides rain in andhra pradesh and telangana imd

Low Pressure Area, Arabian Sea, comarine, Heavy Rains, Coastal Andhra Pradesh, Telangana, meteorological department, Kyarr cyclone, bay of bengal, Telugu states rainfall, Rain in Telangana, Rain in Andhra Pradesh, Telangana, Andhra Pradesh, Politics

Earlier due to Cyclone Maha strong southeasterly winds from the Bay of Bengal were feeding moisture to Coastal Andhra Pradesh that resulted in heavy rains.

రానున్న 24 గంటల్లో.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

Posted: 11/01/2019 11:16 AM IST
Cyclone maha subsides rain in andhra pradesh and telangana imd

తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాటు వీడటం లేదు. వర్షాకాలంలో ఆలస్యంగా తెలుగురాష్ట్రాలపై కరుణ చూపిన వర్షాలు.. అప్పటి నుంచి ఈ ఇరు రాష్ట్రాల్లో ప్రతీరోజు ఏదో ఒక చోట కురుస్తూనే వున్నాయి. రికార్డు స్థాయిలో కురిసన వర్షాలు తెలుగు రాష్ట్రాలలోని అనేక లోతట్టు ప్రాంతాల ముంపుకు గురిచేశాయి. ఇక నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయాయని ఊపిరి తీసుకుంటున్న తెలుగువారికి.. ఈ వర్షాలు మళ్లీ ఈశాన్య రుతుపవనాల రూపంలో వచ్చి ప్రభావం చూపుతున్నాయి.

ఇక రానున్న 48 గంటల్లో ఉత్తర అండమాన్‌ వద్ద సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలో 5, 6 తేదీల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, మధ్య కోస్తాలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అలాగే, వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలలో అక్కడక్కడా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించింది.

మరోవైపు, అరేబియా సముద్రంలో రెండు తుపాన్లు కొనసాగుతుండగా, సూపర్ సైక్లోన్‌గా మారిన ‘క్యార్‌’ బలహీనపడి పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో తుపానుగా కొనసాగుతోంది. నేడు ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘మహా’ తుపాను నిన్న సాయంత్రానికి తీవ్ర తుపానుగా బలహీనపడి, రాత్రికి లక్షదీవుల వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles