Nilam Sawhney likely to be AP Chief Secretary ఏపీ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని.?

Ys jagan to appoint nilam sawhney as chief secretary of andhra pradesh

LV Subrahmanyam, Chief secretary, Transffered, first lady Chief Secretary, Neelam Sawhney, Director General, AP Human Resources Development Institute, Praveen Prakash, Principal Secretary, YS Jagan, Chief Minister, Andhra Pradesh, Politics

Just hours after transferring CS LV Subramanyam, the latest buzz in AP circles is that CM has already chosen the new Chief Secretary of Andhra Pradesh. It is learnt that AP would get its first lady Chief Secretary. Neelam Sawhney is likely to be appointed as the new CS of AP.

ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని.?

Posted: 11/05/2019 10:49 AM IST
Ys jagan to appoint nilam sawhney as chief secretary of andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం.. గంటల వ్యవధిలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసుకుందని, అయితే అధికారికంగా నియామకాన్ని ప్రకటించడమే తరువాయి అని తెలుస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యం నుంచి సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న అధికారి పదవిలోకి వస్తూనే మరో్ రికార్డును కూడా క్రియేట్ చేసే అవకాశాలు వున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తొలిసారి ఓ మహిళా అధికారి ఎంపిక కావడమే. ఇంతకీ అమె ఎవరు?.

ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ నేపథ్యంలో రేగిన రాజకీయ కలకలం ఓ వైపు రగలుతూనే వుండగా, ఏరి కోరి తెచ్చుకున్న అధికారితోనే ఆరునెలల పాటు పనిచేయించుకోలేని స్థితిలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లిపోయారని విమర్శలు వచ్చాయి. మరో ఆరునెలల్లో రిటైర్ కావాల్సిన అధికారికి కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఎందుకీ బహుమానం ఇచ్చిందీ.? ఆయన నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించను అని అన్నందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందా.? అన్న అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవర్ని ఎంపిక చేయనున్నారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి.

అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఐదు మాసాల సమయం పూర్తికావస్తున్న క్రమంలో ప్రభుత్వంపై కూడా పలు విమర్శలు పెరుగుతన్నాయి. దీంతో శరవేగంగా నిర్ణయాలను తీసుకుని ముందుకు కదులుతోంది ప్రభుత్వం. దీంతో కొత్త సీఎస్ ఎవరన్న చర్చకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యింది. ఏపీ క్యాడర్‌కు చెందిన నీలం సాహ్ని కొత్త సీఎస్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. సాహ్ని ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సాంఘిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా ఉన్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి సోమవారం మధ్యాహ్నం అమరావతి వచ్చిన సాహ్ని.. ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అనంతరం ఆయనతో కలిసి భోజనం చేసినట్టు తెలుస్తోంది. నిజానికి సీనియారిటీ ప్రకారం చూస్తే 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదన్ ముందున్నారు. ప్రీతి సూదన్ ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. ప్రీతి సహా మరికొందరి పేర్లు సీఎస్ రేసులో వినిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం రెండో స్థానంలో ఉన్న నీలం సాహ్ని వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles