Woman Tahsildar's driver succumbs to burns తహశీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి

Murdered tahsildar s driver too succumbs to injuries

Vijaya Reddy, Tehsildar attack, Abdullapurmet MRO, Suresh Mudhiraj, gurunadham, driver gurunadham, Rangareddy, Hyderabad’s Outer Ring Road, Telangana Crime

Less than a day after a Tehsildar Vijaya Reddy died in Telangana’s Abdullahpurmpet after being set ablaze, her driver, Gurunatham, also succumbed to his injuries on Tuesday morning. Gurunatham tried to rescue Vijaya at the time of the tragic incident,

మరో విషాదం.. తహశీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి

Posted: 11/05/2019 11:31 AM IST
Murdered tahsildar s driver too succumbs to injuries

రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్‌ తహశీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన సమయంలో ఆమెను రక్షించబోయి తీవ్రగాయాలపాలైన డ్రైవర్ గురునాధం డీఆర్ డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు. విజయారెడ్డిని కాపాడే క్రమంలో గురునాధానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆర్ డీవో ఆస్పత్రి కి తరలించారు. చికిత్స అందిస్తున్నప్పటికీ  పరిస్ధితి విషమించటంతో గురునాధం కన్నుమూశాడు.

గురునాధం స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ. ఆయన మృతదేహాన్ని మరి కొద్ది సేపట్లో ఉస్మానియా మార్చురీకు తరలించనున్నారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించి పార్ధివదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అందచేస్తారు. ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో అమె అక్కడికక్కడే మరణించగా.. అమెను రక్షించబోయిన గురునాథం కు 80 శాతం మేర, అటెండర్ చంద్రయ్యకు 60శాతం పైగా గాయాలయ్యాయి. మంటలు అర్పే ప్రయత్నంలో గాయాల పాలైన మరో వ్యక్తి నారాయణ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాగా, ఎమ్మారో విజయా రెడ్డిపై ఘాతుకాన్నికి పాల్పడిన నిందితుడు సురేష్‌కు 35 శాతంపైగా గాయాలైయ్యాయి. వెంటనే స్థానిక అసుపత్రిలో చేరగా, ఆయనను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. కాగా గురునాథంతో పాటు చంద్రయ్యను అపోలో డీఆర్‌డీఎల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అపోలో డీఆర్‌డీఎల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురునాథం ఇవాళ ఉదయం కన్నుమూశాడు. గురునాధం భార్య ప్రస్తుతం ఎనమిది నెలల గర్భణి అని.. అమెకు భర్త మరణించిన విషయం ఎలా చెప్పాలని అమె బంధువులు తీవ్ర మానసిక అందోళనకు గురవుతున్నారు.

ఇక చంద్రయ్య పరిస్థితికి కూడా విషమయంగానే వుందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడైన సురేష్ తండ్రి అసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుక్కి మతిస్థిమితం లేదని సురేష్‌ తండ్రి కృష్ణ అన్నారు. అసలు తహసీల్దార్‌ ఆఫీసుకు ఎందుకు వెళ్లాడో తెలియదన్నారు. తమకు ఉన్న భూమిపై హైకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. భూమి వ్యవహారం తన కుమారుడు సురేష్‌కు ఏమీ తెలియదని చెప్పారు. ఎవరో కావాలని ఈ పని చేయించి ఉంటారని సురేష్‌ తల్లి పద్మ అనుమానం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles