atchannaidu challenges minister botsa on Amaravati అమరావతిలో టీడీపీ బృందం పర్యటన

Atchannaidu challenges minister botsa on amaravati

Narayana, atchannaidu, Botsa Satyanarayana, Amaravati, Constructions, MLA quarters, MLC quarters, IAS quarters, YS Jagan, Chief Minister, Andhra Pradesh, Politics

Condemning the comments of Andhra Pradesh Minister Botsa Satyanarayana, TDP Leader Atchannaidu along with another former minister Narayana and other leaders visited Amarvati and challenged the minister botsa on the constuctions made in State New Capital.

అమరావతిపై మంత్రి బొత్సకు అచ్చెనాయుడు సవాల్..

Posted: 11/06/2019 02:27 PM IST
Atchannaidu challenges minister botsa on amaravati

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు లేవంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంపై కావాలనే ఆయన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రి బొత్స హుందతనంతో వ్యవహరించాల్సింది పోయి.. ఒక జోకర్ మాదిరిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో నిర్మాణాలు లేవంటూ మంత్రి బొత్స చేసిన కామెంట్ల నేపథ్యంలో అచ్చెన్నాయుడు, నారాయణ నేతృత్వంలో టీడీపీ బృందం అక్కడ పర్యటించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడ్డారు. అమరావతిలో శాసన సభ్యులకు 280 ప్లాట్లు సిద్ధం అయ్యాయని వివరించారు. జగన్ సొంత ఇంటి కంటే క్వాలిటీగా నిర్మాణాలు ఉన్నాయని అన్నారు. 60 రోజుల్లో పూర్తి అయ్యే నిర్మాణాలను.. శాడిస్ట్ ఆలోచనతో ఆపేశారని ధ్వజమెత్తారు. మంత్రి బొత్స లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘అమరావతిలో అవినీతి అన్నారు.. ఏం తేల్చారు..?’ అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

అమరావతిలో నిర్మాణాల కోసం మునుపటి టీడీపీ ప్రభుత్వం 9 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే.. ఏకంగా 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కోన్నారు. తాజాగా అమరావతిపై మరో కమిటీని వేస్తూ గెజిట్ విడుదల చేయడంపై కూడా ఆయన మండిపడ్డారు. అమరావతి పేరు చెబితే చంద్రబాబు గుర్తొస్తారనే అక్కసుతోనే నిర్మాణాలను ఆపేశారని ధ్వజమెత్తారు. దేశ పటంలో అమరావతి పేరు లేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narayana  atchannaidu  Botsa Satyanarayana  Amaravati  YS Jagan  Chief Minister  Andhra Pradesh  Politics  

Other Articles