తెలంగాణ ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ మీద ఈ నెల 1వ తేదీని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా అధికారుల తీరులో మాత్రం మార్పు లేదు. దీంతో అధికారులపై న్యాయస్థానం మరోమారు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే అది ధిక్కారణ కిందకు వస్తుందని తెలియదా.? అని నిలదీసిన న్యాయస్థానం మీ సమాచారంతో సీఎం, కేబినెట్, ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.
ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన విచారణలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అర్థికశాఖతో పాటు ఆర్టీసీ యాజమాన్యం సమర్పించిన రెండు నివేదికలను పరిశీలించింది. దీంతో పాటు న్యాయస్థానం అదేశాల మేరకు ఆర్టీసీ స్థితిగతులపై ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ కూడా క్రితం రోజున అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటి బకాయి లేదని తేల్చిచెప్పింది. ఆర్థిక శాఖ అధికారులు, ఆర్టీసీ యాజమాన్యం సమర్పించిన నివేదికలు రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఐఏఎస్ అధికారులు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడిన న్యాయస్థానం.. వారిపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వచ్చిన పిటీషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ సాగింది. ఈ సందర్భంగా తప్పుడు నివేదికలు ఇస్తే, ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా? అని ప్రశ్నించింది. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలని సూచించింది. అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టు తెలిపింది. అయితే, ప్రభుత్వం, ఆర్టీసీ చిత్తశుద్ధితో ముందుకు రావట్లేదని చెప్పింది. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖల అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా లెక్కలు చెబుతున్నారని తెలిపింది. ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని పేర్కొంది. తమతో వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. మీ సమాచారంతో సీఎం, కేబినెట్, ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? అని నిలదీసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more