తెలంగాణలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తన భూసమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ పోసి అత్యంత పాశవికంగా సజీవ దహనం చేసిన ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రెవెన్యూ ఉద్యోగుల పాలిట శాపంగా మారనుంది. ఇదే అస్త్రాన్ని తాము ఆచరిస్తామని తెలుగు రాష్ట్రాల రైతుల నుంచి రెవెన్యూ అధికారులకు బెదిరింపులు వస్తున్నాయి. ఎమ్మార్వో విజయారెడ్డి ఘటన జరిగి వారం రోజులు కూడా కాకముందే రెండు రాష్ట్రాల్లోని పలువురు రెవెన్యూ సిబ్బందికి ఈ బెదరింపులు వస్తున్నాయి.
తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో తాము చనిపోవడంతో పాటు అధికారులను కూడా అంతమొందిస్తామన్న బెదిరింపులు అధికమైపోయాయి. ఈ విషయాన్ని అటుంచితే.. రెవెన్యూ శాఖలోని సిబ్బంది ప్రజల నుంచి డబ్బులు తీసుకున్న విషయం కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు ఇదివరకే యాదాద్రి జిల్లాకు చెందిన ఓ విఆర్వో ఓ రైతుకు పాస్ పుస్తకాన్ని అందిస్తానని చెప్పి.. తాత్సారం చేసిన కారణంగా.. విజయారెడ్డి హత్యకు నిరసనగా వారు ఎమ్మార్వో అధికారి ఎదుటే నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఓ మహిళ వీఆర్వోను కొట్టినంత పనిచేసింది. అమె భర్త నిలువరించి వుండకపోతే.. అంతపని జరిగివుండేది. తామిచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది.
ఇక స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలోని కొండాపురం మండలంలోని దత్తాపురంకు చెందిన బుడిగ ఆదినారాయణ తన భూమికి సంబంధించి సమస్యను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో అవేశానికి లోనైన ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకొన్నాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అడ్డుకున్నారు. అతడ్ని బయటకు తీసుకొచ్చి నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది. ఇటు తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాల్లో ఓ యువకుడు ఏకంగా కలెక్టర్ కార్యాలయంలో తన భూసమస్య విషయమై వస్తే ఎప్పుడూ కలక్టర్ కలసిన పాపన పోలేదని.. తాను పెట్రోల్ సీసాతో రావాలా.? అంటూ అవేదనకు లోనయ్యాడు.
ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకలపాడులో రైతు భరోసా సభలోనూ ఓ రైతు పెట్రోల్ బాటిల్ తీసుకువచ్చి మహిళా ఉద్యోగినిని బెదిరించాడు. పంచాయతీ కార్యదర్శిని పనిచేస్తున్న జే సుమలత వద్దకు వచ్చిన అల్లు జగన్ మోహన్ రావు అనే వ్యక్తి, తన పొలంలో మురికి కాలువ తవ్వించారని, ప్రభుత్వ సాయం అందకుండా చేస్తున్నారని, లంచం అడుగుతున్నారని దూషించాడు. ముందుగానే బ్యాగులో ఉంచుకున్న పెట్రోల్ బాటిల్ ను బయటకు తీసి, దాన్ని పోసి అంటించి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగగా, అక్కడున్న వారంతా హడలిపోయారు.
ఆ వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ అక్కడున్న అధికారులు, ఇతరులపైనా పడింది. ఈలోగా అతను అగ్గిపెట్టెను తీయడంతో, మరింత ఆందోళనకు గురైన సదరు మహిళా అధికారిణితో పాటు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పరుగులు తీశారు. జరిగిన ఘటనపై పంచాయతీ కార్యదర్శి సుమలత, పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, రైతును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీపీవో సమీక్ష నిర్వహించగా, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఫోన్ లో సుమలతను పరామర్శించారు. అధైర్యపడవద్దని, నిర్భయంగా విధులు నిర్వహించాలని, తప్పులు జరగకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more