తెలంగాణ ఆర్టీసీ విషయం ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తలంటుతున్నా.. ఏ మాత్రం పట్టని ఆర్టీసీ యాజమాన్యం తన తీరును మార్చుకోవడం లేదు. ఈ క్రమంలో కార్మికులను తొలగించే చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హుంకరింపులు తాటాకు చప్పళ్లేనని హైకోర్టు తేల్చేసింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టులో అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు న్యాయస్థానానికి కేంద్రం వాదనను వినిపించారు. దీంతో కేంద్ర గుర్తింపు లేకుండా టీఎస్ఆర్టీసీ స్థాపన ఎలా జరిగిందంటూ హైకోర్టు ప్రశ్నించింది.
తాజాగా ఈ విషయమై కేంద్రం స్పిందించింది. టీఎస్ఆర్టీసీ ఏర్పాటును తాము చట్టపరంగా గుర్తించడం లేదని ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తేల్చిచెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కోన్నట్లు తెలిసింది. ఏపీఎస్ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున టీఎస్ ఆర్టీసీ ఏర్పాటును తాము గుర్తించలేదంటూ ఆయన పేర్కొన్నట్లు సమాచారం. సమ్మె వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ సూచించారు. తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కేంద్రానికి రాసిన లేఖకు సమాధానంగా గడ్కరీ ఈ ప్రత్యుత్తరం రాశారు.
కాగా ఈ విషయాలను క్రితం రోజున హైకోర్టులో అడిషనల్ సాలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు కూడా చెప్పారు. ఆర్టీసీని విభజించాలని కానీ, పునర్వ్యవస్థీకరించాలని కానీ తమ అనుమతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని ఆయన తెలిపారు. అసలు, ఏపీఎస్ఆర్టీసీ విభజన ఇంకా పూర్తికాలేదని వెల్లడించారు. అలాంటప్పుడు చట్టబద్ధతలేని టీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా ఎక్కడ ఉంటుందని, చట్టబద్ధత ఉన్న ఏపీఎస్ఆర్టీసీలోనే 33 శాతం వాటా ఉందని రాజేశ్వరరావు కోర్టుకు తెలియజేశారు. టీఎస్ఆర్టీసీకి చట్టబద్ధత లేనందున ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి ఉన్న వాటాను బదిలీ చేయడం కుదరదని తేల్చి చెప్పారు.
దీనిపై ఏజీ,తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పందిస్తూ, ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని కోర్టుకు తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేశామని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ఏపీఎస్ఆర్టీసీని విభజించాలని రెండు రాష్ట్రాలు కోరాలి కదా? అని ప్రశ్నించింది. కేంద్రం ఆమోదం లేకుండా కొత్త ఆర్టీసీ సంస్థలు ఏర్పాటు ఎలా సాధ్యం అంటూ అడిగింది. విభజన అంశం పెండింగ్ లో ఉందని మీరే అంటున్నారు, అలాంటప్పుడు కొత్త ఆర్టీసీ ఏర్పాటు ఎలా సాధ్యమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more