Supreme Court on Sabarimala Temple Case శబరిమల వివాదం ..

Supreme court on sabarimala temple case

Sabarimala verdict, Women Entry, Supreme Court, Sabarimala Case, Sabarimala Women Entry

The Supreme Court's verdict to refer Sabarimala review pleas to a larger bench poses a major challenge

శబరిమల వివాదం ..

Posted: 11/14/2019 03:10 PM IST
Supreme court on sabarimala temple case

అయ్యప్ప అంటే వృద్ధి అని అర్ధం..హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మ చారి.. అందుకే ఆయన ఆలయానికి స్త్రీలకు ప్రవేశం ఉండదు.. 10-50 ప్రాయం గల ఆడవారు రుతు క్రమం దశలో ఉంటారు కాబట్టి వారికి ఆలయ అవకాశం ఉండదు . .. అటువంటి ఆడవారికి ఆలయంలోకి ప్రవేశిస్తే ఆలయం అపపవిత్రం అవుతుంది అని అనాదిగా వస్తున్న ఆచారం మరియు నమ్మకం..ఆ నమ్మకాన్నికి తలవంచి అప్పటి నుండి చాల మంది మహిళలు ఆ ఆలయానికి వెళడానికి ఆసక్తి చూపరు.. అంతే కాకుండా అప్పటి ఆచార నమ్మకాన్ని కి కట్టుపడి ఉన్నారు.

ఈ శబరీ మల ఆలయ ప్రవేశానికై మహిళల పోరాటం ఇప్పటిది కాదు .. నేటికి కూడా చిక్కు విడని ముడివలె మన చుట్టూ తిరుగా డుతుంది.. ఆలయ ప్రవేశానికి కొందరు మహిళలు కోర్ట్ లో పిటిషన్ దాక వేశారు.. దిన దినా భివృద్ధి చెందుతూ ప్రదర్శన అది బాగా బలపడింది.. ఆడవారిని ఆలయంలోకి అనుమతించాలా వద్దా అనే తీవ్ర అంశం పై 7 మంది న్యాయమూర్తులు విస్తృత ధర్మాసాన్ని బదిలీ చేయాలనీ 5 సభ్యుల యొక్క ధర్మాసనం నిర్ణయించింది.. దర్మాసనంలోని మెజారిటీ సభ్యుల ఆధారంగా గురువారం నాడు తీర్పును ఇచ్చింది.. ఆలయ ద్వారాలు మరో రెండు రోజులలో తెరుచుకోబోతుండగా గతంలో సర్వోన్త న్యాయ స్థానం ఇచ్చిన తీర్పు పై స్తే ఇవ్వడానికి నిరాకరించింది.. ఆ తీర్పును పున; పరిశీలించాలని భావించింది..

మతంలోని అంతర్గత విషయాలన్నీ వాటి గురించి చర్చించాలని పిటిషన్లలో పేర్కొన్నది..

నేటి భౌగోళిక ప్రకృతి కారకాల వల్ల మహిళలు తమకు కూడా సమాన హక్కులు ఉన్నాయి .. మేము కూడా ఆలయ ప్రవేశం చేయొచ్చు అన్ని భావించారు.. .. శబరీమల ప్రధాన ఆలయం పక్కన ఒక చిన్న గుడి ఉంటుంది .. అందు మాలికాపురతమ్మ కొలువుదిరి ఉంటారు.. అయ్యప్ప ఆలయ ప్రవేశం మహిళలు చేస్తే ఆమెను అప పవిత్రం చేసిన్న టుగా అని భావిస్తారు.. ఈ విశ్వాస నమ్మకాలను గౌరవం ఇస్తూ హైకోర్టు న్యాయ స్థానం 1991 లో ఒక శాసనం చట్టబద్ధం చేస్తూ మహిళలు 10- 50 సంవత్స్రాల ఆడవారికి ఆలయ అనుమతి నిషేధం అని తీర్పు ఇచ్చింది.. .. అప్పటి నుండి మొదలైంది ఆలయంలోకి అన్ని వయస్సుల వారిని ప్రవేశ అవకాశం కలిపించాలని..

కేరళలోని పతనందిట్ఠా జిల్లాలో పశ్చిమ కనుమలలో శబరీ మల శిఖరం పై అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు.. సముద్ర మట్టానికి 3 వేలా ఎత్తులో పెరియార్ పులుల అభయ అరణ్యంలో 18 గుట్టల నడుమ ఈ ఆలయం నిర్మించబడింది.. .. ప్రతి ఏటా ఈ ఆలయ దర్శనానికి తమిళనాడు,కర్ణాటక,తెలంగాణ,కేరళ,ఆంధ్ర ప్రదేశ్ నుండే కాకుండా దేశ వీదేశాల నుండి కూడా భక్త జనం తరలి వస్తుంది .. ఈ గుడిని నవంబర్ డిసెంబర్ నెలల్లో మండల పూజాకి మరియు జాన్ 14 న మకర సంక్రాంతికి, ఏప్రిల్ 14 న విషువ పండగకు, మలయాళ నెలలోని మొదటి 5 రోజులలో పూజలు చేసుకోవడానికి ఆలయాన్ని తెరిచి ఉంచుతారు..

ఇదిలా ఉంటె సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గోగోయి ఈ విధంగా తన తీర్పు ప్రతిని చదివి వినిపించారు.. .. మతం అనేది దైవానికి,మనిషిని అనుసంధానం చేసేది మాత్రమే . మహిళల ప్రవేశానికి నిబంధనలు విధించడం కష్టమే ఆలా అని విధించకుండా ఉండలేము . .. ఈ తీర్పు ఈ ఒక దేవాలయం తోనే ఆగదు యావత్ భారత దేశ ఆలయాలు, మసీదులకు సంబందించినది.. ఈ ఆలయ ప్రవేశానికి అనుమతి ఇస్తే మసీదు ప్రవేశానికి అనుమతి కై కొత్త ఆలోచన మదిలో పుడుతుంది . మతంలోకి చొచ్చుకు పోయే అధికారం కోర్టులకు లేదు..

శబరిమల వ్యవహారాన్ని ఏడుగురు సభ్యుల విసృత ధర్మసన్నాని బదిలీ చేసే అంశం పై 3.2. మెజారిటీ తో తీర్పు వెలువడింది.. అయితే ఈ నిర్ణయాన్ని ప్రస్తుత దర్మాసనంలోని సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ రంజాన్ గోగోయి ఖన్విల్కర్ , ,ఇందు మల్హోత్రా, బలపర్చగా , జస్టిస్ చంద్రచూద్ ,.జస్టిస్ నారిమన్ గతంలో తాము ఇచ్చిన తీర్పునే కొనసా గ్గించాలని అభిప్రాయపడ్డారు.. ఆలయ పురాణాల లోకివెళితే ఒక యువతీ అయ్యప్ప స్వామి ని వివాహ మాడడానికి వెళితే స్వామి ఇలా అన్నారు.. నన్ను దర్శించుకోవడానికి ఏ సంవత్సరం అయితే కొత్త భక్తులు రాకుండా ఉంటారో అప్పుడు వివాహం చేసుకుంటానని స్వామి స్పష్టం చేసారు.. అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామిని ఎప్పుడు దర్శించడానికి భక్తులు వస్తూనే ఉంటారు.. అయ్యప్ప నైస్థిక బ్రహ్మచారిగా కొలువు దీరారు.. అప్పటి నుండి సదరు మహిళా అదృశ్య రూపంలో గుడి బయట ఉంది వెచ్చి చూస్తుందని భక్తుల నమ్మకం..

ఇంతలా మన ఆచార పురాణాలలో కథలు ఉండగా ఇంకా ఆలయ ప్రవేశానికి ఆలోచనలు అనవసరం.. కొన్ని నిజాలను,ఆచార వ్యవహారాలను మంచి మనస్సుతో ఆచరిస్తే రాబోయే తరాల వారికీ ఒక మార్గ దర్శంకంగా ఉంటుంది.

ఏదిఏమైనా యావత్ భారత ప్రజా సమూహం కోరుకునేది ఒకటే ఆచార సంప్రాదయాలకు మన దేశం పెట్టింది పేరు..వాటికీ ఎటు వంటి దుస్థితి కలిగించకూడదు అని ఒక చిన్న ఆవేదన..
స్వామి శరణం అయ్యప్ప ..

అయ్యప్ప శరణం స్వామియే..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sabarimala verdict  Women Entry  Supreme Court  

Other Articles