Pawan kalyan questions CM Jagan, Is Telugu only for Funds కేంద్రం నిధుల కోసమేనా మాతృబాష: పవన్ కల్యాణ్

Pawan kalyan fumes at cops over harassment in vijayawada

Pawan Kalyan, JanaSena, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, 350-A, Telugu language, English medium, Telugu medium, Mother Tongue, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

Jana Sena president Pawan Kalyan took a strong exception to attacks and foisting of false cases against his party workers by police department. In a press release, Pawan while condemning the attitude of police department, requested the party workers to maintain restraint.

కేంద్రం నిధుల కోసమేనా మాతృబాష: పవన్ కల్యాణ్

Posted: 11/20/2019 11:02 AM IST
Pawan kalyan fumes at cops over harassment in vijayawada

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖలో చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతం కావడం.. ఆ తరువాత ప్రభుత్వం కూడా దిగివచ్చి ఇసుక కొరత నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు బలవన్మరణాలకు పాల్పడిన భవన నిర్మాణ రంగంలోని కార్మికుల కుటుంబాలకు పరిహారంగా రూ.5లక్షలు అందిస్తామని ప్రకటించడంతో ఈ అంశంలో ఆయన విజయం సాధించారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రజల తరుపున ప్రశ్నించేగళంగా మారిన పవన్ జనసేన పార్టీ ఇక తాజాగా తెలుగు బాష బోధన అంశాన్ని ఎంచుకుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై క్రితం రోజు నుంచి జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్.. మాతృ భాషని, మృత భాషగా మార్చకండి.. భాష సరస్వతిని అవమానించకండి అంటూ సూచించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై మరోమారు స్పందించిన పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వంపై తనదైన ఆరోపణలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న నిధుల దారిమళ్లింపు విషయాన్ని కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్రమోడీ ప్రభుత్వం గమనిస్తుందని ట్విట్టర్ వేదకగా సూచనలు చేశారు.

"350 -ఏ... వాడి - అంటే తెలుగు కోసం డబ్బులు తీసుకొని, ఇంగ్లీషు కోసం ఖర్చుపెడతారా? ప్రధాని కార్యాలయం దీన్ని గమనిస్తుంది జగన్ రెడ్డి గారూ" అని పవన్ హెచ్చరించారు. అంతకుముందు "కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప , మనకి  తెలుగు భాష సరస్వతి దేనికి పనికిరాదన్న మాట...పార్లమెంటులో నరసాపురం పార్లమెంటు ‘వైసీపీ ఎంపీ’ -రఘురామకృష్ణంరాజు గారి మాటలు వింటే నాకే కాదు, ఎవరికైనా  అదే అనిపిస్తుంది" అని ట్వీట్ చేశారు.


తెలుగు బాష అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ఎంపీలకు డబ్బులు వచ్చే వనురుగానే మారిందా.? తెలుగు బాష పేరు చెప్పి కేంద్రం నుంచి డబ్బులు తీసుకుని ఇంగ్లీష్ బాషా అభివృద్ది కోసం వాటిని వినియోగిస్తారా.? అంటూ ఆయన ఫైరయ్యారు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకునేందుకు తప్ప, తెలుగు భాష మరెందుకూ పనికిరాకుండా పోయిందన్న ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్లమెంటులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలుగు బాషపై చేసిన ప్రసంగాన్ని ఆయన పోస్ట్ చేస్తూ.. ఈ ఎంపీ మాటలు వింటే నాకే కాదు ఎవరికైనా అదే అనిపిస్తుందని పవన్ కల్యాణ్ విమర్శించారు.


ఇక అంతకుముందు ఆయన విడుదల చేసిన ధర్మవరం ఘటనలో పోలీసుల అత్యుత్సాహంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజారక్షకుడైన ఒక ఉద్యోగి అనాలోచిత, విచక్షణారహిత, పక్షపాత వ్యవహారశైలివల్ల ధర్మవరంలో ప్రస్తుతం అశాంతితో అల్లాడిపోతోంది. గుంటూరు జిల్లా దుర్గి మండలంలో ఉన్న ఈ గ్రామంలో చాలామంది పురుషులు పోలీస్ భయం కారణంగా గ్రామం వదిలి ఇతర ప్రాంతాలలో తలదాచుకోవలసిన దురదృష్ట పరిస్థితిని పోలీసులు సృష్టించారు. శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులే అశాంతికి కారణమైతే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? అని ఆయన ప్రశ్నించారు.

గ్రామంలో ఏటా జరిగే తిరునాళ్లలో ఆనందంగా నాటికను ప్రదర్శించడమే పాపమా? ఆ నాటికలో జనసేన జెండాలు ప్రదర్శించడమే నేరమా? నాటికను మధ్యలో బలవంతంగా ఆపేసే అధికారం ఆ పోలీస్ ఉద్యోగికి ఎవరిచ్చారు? ఈ నాటిక ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది పోలీసులే.. దీనిని ప్రశ్నించిన మహిళలను నెట్టివేయమని (మాన్ హ్యాండ్లింగ్) ఏ చట్టం చెబుతోంది? లాఠీలతో కొట్టడానికి ఆ అధికారికి ఎవరు అనుమతి ఇచ్చారు. ఆడవారిపై దౌర్జన్యం చేసి గ్రామస్తులను రెచ్చగొట్టిన పోలీసుపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను జనసేన కోరుతోందని పేర్కోన్నారు.

అక్రమంగా అరెస్టుచేసిన జనసేన కార్యకర్తలు నాగేశ్వర రావు, బి.రమేష్‌లను తక్షణం విడుదల చేయాలి. మరో 32 మందిపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు రెచ్చగొట్టినప్పటికీ, మనల్ని ఎవరు దూషించినప్పటికీ శాంతియుతంగానే సమాధానం చెబుదాం. ఇటువంటి విషయాలలో జనసైనికులు సంయమనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బాధితులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles