టీఎస్ఆర్టీసీ కార్మికులు జేఏసీ పిలుపుతో గత 50 రోజులుగా చేస్తున్న సమ్మె ఆగమ్యగోచరంగా మారింది. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు కార్మికులకు కూడా మరో షాక్ తగిలింది. తెలంగాణలోని బస్సు రూట్లను ప్రైవేటీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు రూట్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కొట్టివేసింది. 5,100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగిస్తూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపినట్లైంది.
తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసేందుకు ముందు ఈ అంశమై న్యాయస్థానంలో గత కొన్ని రోజులుగా సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. క్యాబినేట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదం లభించి.. జీవోలు వచ్చిన తరువాత న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదని, ఎవరూ సవాల్ చేయకూడదని ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగానే ఉందని అన్నారు,
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. వారికి మెరుగైన రవాణ సౌకర్యంతో పాటు తక్కువ ధరకే గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏజీ చెప్పారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ.. రాష్ట్రంలోని పలు రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి ప్రభుత్వం చేరకుందని ఏజీ వివరించారు. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకుందని, చట్టానికి అనుగుణంగా కేబినెట్ నిర్ణయం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు.
రవాణా అథారిటీ అనే పదాన్ని హైకోర్టు తప్పు బట్టింది. కానీ ప్రైవేటీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అమలు చేసి.. రవాణా అథారిటీ బదులు రాష్ట్ర రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి చేత ప్రక్రియ నిర్వహిస్తారని ఏజీ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాంగ్మూలం ఇవ్వడంతో అందుకు న్యాయస్థానం సమ్మతించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషనర్ వాదనలో బలం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. రూట్ల ప్రైవేటీకరణపై తీర్పు ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చిన నేపథ్యంలో కార్మికుల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది.
ఆర్టీసీ భవితవ్యం, కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసినా.. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే దీనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదు. అయితే క్రితం రోజున నిర్వహించిన సమీక్ష ప్రస్తుతం నెలకొన్న అర్థికమాంద్యం పరిస్థితుల్లో ఆర్టీసీని నడపడం భారంగా పేర్కొన్నారు. వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more