మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుపై గత నెల రోజులుగా సాగిన ఉత్కంఠకు తెర తొలగించే సమయం ఆన్నమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమ మధ్య సయోధ్య కుదిరిందని శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. అయితే శివసేన తొలి రెండున్నరేళ్లు, ఆ తరువాత ఎన్సీపి మరో రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందడంలో నెలకొన్న అవంతరాలు కూడా తొలగిపోయాయి.
ఇక మూడు పార్టీలకు 14-14-14 చోప్పున మంత్రి పదవులను పంచుకునే విషయంతో పాటు ఏయే మంత్రిత్వ శాఖలను పంచుకోవాలన్న విషయమై కూడా క్లారిటీ వచ్చేసింది. ముఖ్యమంత్రి పదవితో పాటు 13 మంత్రి పదవులు శివసేన తీసుకోగా, ఉపముఖ్యమంత్రి పదవితో పాటు 13 మంత్రి పదవులను కాంగ్రెస్, ఎన్సీపీలు పంచుకోనున్నాయి. ఇక ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ ప్రకటించారు.
ముంబైలోని నెహ్రూ సెంటర్లో శివసేన నేతలు ఉద్ధవ్ థాకరే, అదిత్య థాకరేలతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీనియర్ నేత అజిత్ పవార్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పృథ్వీరాజ్ చౌహాన్, అశోక్ చౌహాన్ లు సమావేశమయ్యారు. మహారాష్ట్రలో ఏర్పాటు కానున్న ప్రభుత్వం విషయాలపై వారు చర్చించారు. ఈ భేటీలో సీఎంగా ఉద్దవ్ థాకరే పేరుపై ఏకాభిప్రాయం కుదిరిందని శరద్ పవార్ ప్రకటించారు. ఈ మూడు పార్టీల నేతలు రేపు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై తమ సన్నద్ధతను తెలుపనున్నట్లు శరద్ పవార్ వెల్లడించినట్లు తెలుస్తోంది.
170 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు అందించనున్నట్లు సమాచారం. రేపు మూడు పార్టీల నేతలు మీడియా సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ఏర్పాటుపై ఉమ్మడిగా ప్రకటన చేస్తారని పవార్ పేర్కొన్నారు. కాగా, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా నిలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మహారాష్ట్రకు చెందిన ఎస్ఐ సింగ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. శివసేన-ఎన్సిపి-కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్కు తగిన ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more