మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణం మారుతూ మరఠ్వాడవాసులను మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజేపి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి..ఎన్సీపీ పార్టీ నుంచి విడిపోయి ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన అజిత్ పవర్ మినహాయించి ఏఒక్కరూ బీజేపికి మద్దతునివ్వడం లేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇటీవల జరగిన ఎన్నికలలో తమ పార్టీ తరపున గెలిచిన 54 మంది ఎమ్మెల్యేలలో 53 మంది తమతోనే వున్నారని వెల్లడించింది. అయితే ఒకే ఒక్క ఎమ్మెల్యే అయిన అజిత్ పవార్ మాత్రమే బిజేపికి మద్దతునిస్తున్నారని తెలిపింది.
కాగా, ఆ ఒక్కడిని కూడా తిరిగి తమ గూటికే రప్పించుకునేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నాలు చే్స్తోంది. బీజేపికి గట్టిగా బుద్ది చెప్పాలంటే ఆ వైపుకు ఆకర్షితుడైన తమ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అజిత్ పవార్ ను కూడా తమవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తూనే వుంది. ఇందులో భాగంగా ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద హైడ్రామా కొనసాగింది. అజిత్ పవార్ ను అసెంబ్లీలోని ఆయన గదిలో కాసేపు ఎన్సీపీ నేతలు నిలువరించినట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
త్వరలోనే బీజేపీ-ఎన్సీపీ (అజిత్ వర్గం) బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో అజిత్ పవార్ భేటీ అయి చర్చలు జరిపారు. అనంతరం ఎన్సీపీ నేతలు ఆయనను ఆయన గదిలో కలిసి.. కాసేపు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత శరద్ పవార్‌తో మాట్లాడించినట్టు సమాచారం. అంతకుముందు ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ అజిత్‌తో భేటీ అయి చర్చలు జరిపారు. శరద్ పవార్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతునివ్వబోరని ఛగన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అజిత్ మనస్సు మార్చుకొని తిరిగి ఎన్సీపీ గూటికి వస్తారా? లేక బీజేపీతో ముందుకు సాగుతారా? అన్నది ఆసక్తి రేపుతోంది.
ఇదిలావుండగా, బీజేపీతో చేయి కలిపిన అజిత్ పవార్ కు రెండు రోజుల్లోనే ఊరట లభించింది. తొమ్మిది అవినీతి కేసుల్లో ఆయనకు క్లీన్ చిట్ లభించింది. నీటిపారుదల ప్రాజెక్టులో 70 వేల కోట్ల అవినీతి జరిగిందన్న కేసును కూడా మూసేశారు. ఈ సందర్భంగా ఏసీబీకి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, అజిత్ పవార్ పై ఎలాంటి అవినీతీ కేసులు లేవని తెలిపారు. మరోవైపు, ఈ కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ రావడంపై శివసేన, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపించాయి. కేసులను దృష్టిలో ఉంచుకునే బీజేపీకి అజిత్ పవార్ మద్దతిచ్చారని... ఇదంతా డీల్ లో భాగమేనని విమర్శించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more