SC orders Maharashtra floor test tomorrow ‘మహా’ బలనిరూపణ రేపే: ‘సుప్రీం’ తీర్పు..

Supreme court says maharashtra floor test tomorrow by 5 pm

BJP, Shiv Sena, Maharashtra President's rule, governor, Supreme Court, Bhagat Singh Koshyari, President's rule, Devendra Fadnavis, Ajit pawar, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, bjp, congress, sonia gandhi, sharad pawar, sonia gandhi sharad pawar meeting, shiv sena, maharashtra govt formation, Maharashtra, Politics

The Supreme today ordered for a floor test to be held on Wednesday in Maharashtra assembly. The floor test will be concluded by 5pm and will be conducted by Protem Speaker after he administers oath to MLAs.

‘మహా’ రాజకీయం: రేపే బలపరీక్ష.. రహస్య ఓటింగ్ వద్దు: ‘సుప్రీం’ తీర్పు..

Posted: 11/26/2019 10:42 AM IST
Supreme court says maharashtra floor test tomorrow by 5 pm

మహారాష్ట్రలో రాజకీయాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించడంతో మహా రాజకీయాల్లో అనూహ్య మార్పులు.. ప్రణాళికలు, ఎత్తులకు ఫైఎత్తులు వేసే చర్యలల్లో తలమునకలయ్యాయి. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ల చేత అప్రజాస్వామికంగా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారని అభియోగిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ ను స్వాగతించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారమే బలపరీక్షను నిర్వహించాలని అదేశించింది.

మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నావిస్, అజిత్ పవార్ ల కూటమికి నిజంగా బలముంటే.. ఈ నెల 30 వరకు ఆగాల్సిన సమయం ఎందుకని ప్రశ్నించిన న్యాయస్థానం.. కూటమి బలాన్ని వెంటనే నిరూపించుకోవాలని అదేశించింది. రేపే అసెంబ్లీని సమావేశపర్చి బలపరీక్ష సిద్దం కావాలని పేర్కోంది. తమకు బలం వుందని చెబుతూ ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా చేపట్టిన తరువాత ఇంకా బలనిరూపణకు ఆలస్యం చేయడం వెనుక అర్థమే లేదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

జస్టిస్ ఎన్వీ రమణ, అశోక్ భూషణ్, సంజీవ్ ఖన్నాలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఈ సందర్భంగా బలపరీక్ష నిర్వహణకు పలు ఆదేశాలు జారీ చేసింది. బలపరీక్ష జరగాల్సింది రాజ్ భవన్ లో కాదని, అసెంబ్లీలో అని పేర్కోన్న సర్వోన్నత న్యాయస్థానం.. రేపు ఉదయం ప్రోటెమ్ స్పీకర్ ఎంపిక చేసిన తరువాత ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం బలపరీక్ష జరపాల్సిందిగా సుప్రీంకోర్టు అదేశించింది. రేపు సాయంత్రం ఐదు గంటల లోపు ఈ వ్యవహరాన్ని పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం అదేశించింది.

బల పరీక్షను సజావుగా నిర్వహించేందుకు ప్రొటెమ్ స్పీకర్ ను తక్షణమే నియమించాలని అదేశించిన న్యాయస్థానం.. ఇక మొత్తం అసెంబ్లీ సమావేశాలను చిత్రీకరిస్తూ, లైవ్ టెలికాస్ట్ చేయాలని కూడా ఆదేశించించింది. బల పరీక్షలో రహస్య ఓటింగ్ ను జరపరాదని కూడా సూచించింది. ఇక ప్రోటెం స్పీకర్ గా ఎవర్ని గవర్నర్ ఎంపిక చేస్తారన్న అంశమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కర్ణాటకలో జరిగిన విధంగానే మహారాష్ట్రలో కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపి వేసిన ఎత్తులకు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఎలాంటి పైఎత్తులు వేస్తుందా.? అన్న ఉత్కంఠ నెలకోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  shiv sena  ajit pawar  devendra fadnavis  bjp  congress  sonia gandhi  sharad pawar  Maharashtra  Politics  

Other Articles