ప్రపంచంలోని 84 కళల్లో చోరీ కళ కూడా ఒక్కటి అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ మనిషీ ఈ కళను తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో వినియోగించినవాడే. అయితే ఈ కళను బాగా ఒంటబట్టించుకున్న ఓ మహిళ.. వినూత్నంగా తన కళను ప్రదర్శించింది. అయితేనేం మేమేం తక్కువా అన్నట్లు వ్యవహరించిన సెక్యూరిటీ సిబ్బంది అమెను అడ్డగించి.. అమె వేసుకున్న జీన్స్ ఫ్యాంట్లను విప్పించారు. అప్పటివరకు దుకాణాదారులు దారుణంగా వ్యవహరిస్తున్నారని అనుకున్నవారంతా ముక్కున వేలేసుకున్నారు. ఔరా ఇంతటి కళానైపుణ్యం కూడా సాధ్యమేనా.? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ విద్యను భారత్ లోనూ అవలంభిస్తే.. దుకాణాలు మూసివేసుకోవడం మినహా మరే మార్గం వుండదని షాపు యజమానులు అందోళన చెందుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. వెనిజులాలోని ఓ యువతి జీన్స్ వస్త్ర దుకాణానికి వెళ్లింది. ఏవో వస్తువులను షాపింగ్ చేస్తున్నట్లు కాసింత సేపు బిల్డప్ ఇచ్చింది. అమె ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఎనమిది జీన్స్ ఫ్యాంట్లను ట్రయల్ రూమ్ లోకి తీసుకెళ్లింది. అయినా కొద్దిసేపటికి అమె ఎలాంటి వస్త్రాలు కొనుగోలు చేయకుండా వట్టి చేతులతోనే దుకాణం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసింది.
తీరా ఆమె తీరును గమనించి అనుమానం కలిగిన దుకాణ సెక్యూరిటీ గార్డులు అమెను పట్టుకుని యజమాని వద్దకు తీసుకువచ్చారు. యజమాని ఏం జరిగిందో చెప్పమని లేదంటే పోలీసులకు అప్పగిస్తామని చెప్పడంతో అమె తన చోరీ కళను తెలిపింది. అది విని నిర్ఘాంతపోయిన యజమానులు.. ఓ గదిలోకి తీసుకువెళ్లి అమె ధరించిన ఫ్యాంటు విప్పాలని అన్నారు. అంతే వారి అదేశాల మేరకు ఆమె తాను ధరించిన ఫ్యాంటులను విప్పింది. అయితే అమె ఒకటి రెండు కాదు ఏకంగా ఎనమిది ఫ్యాంట్లను విప్పింది.
అమె ట్రయల్స్ రూమ్ లోకి తీసుకెళ్లిన ఎనమిది ఫ్యాంట్లను ధరించి.. ఏమీ తెలియనట్టుగా వెళ్లిపోబోయింది. ఎనిమిది ప్యాంట్లను ఒకదానిపై ఒకటి తొడుక్కుని చోరీ చేసేందుకు ప్రయత్నించడంతో యాజమానులు వాటిని అమెతోనే విప్పించారు. ఇలా విప్పుతున్న క్రమంలో వీడియోను కూడా తీశారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మెండోజా అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే 4.2 మిలియన్లకు పైగా వీక్షించారు. పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘చోరీలు చేయడంలో నేర్పరి’ అని చమత్కరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more