దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నిర్భయ ఘటనలో దోషులకు శిక్ష ఖరారు చేసి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా బాధితురాలి తల్లిదండ్రులకు మాత్రం న్యాయం జరగడంలో జాప్యం జరుగుతూనే వుంది. 2012, డిసెంబర్ 16వ తేదీ.. తన కాబోయే భర్తతో పాటు బయటకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కిన పారా మెడికల్ విద్యార్థినిపై దేశ రాజధాని ఢిల్లీలో ఆరుగురు మృగాళ్లు దాడి చేసి అత్యాచారం చేశారు. యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో దోషులకు శిక్ష అమలు చేయడంలో జాపాన్ని అమె తల్లిదండ్రులతో పాటు పలువురు ప్రశ్నిస్తున్నారు.
నిందితులు ఉన్నత న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ.. క్షమాబిక్ష పిటీషన్లు పెట్టుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిర్భయ ఘటనలో దోషులను ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాబిక్ష పిటీషన్ కూడా రాష్ట్రపతి తోసిపుచ్చారు. అత్యాచార ఘటనల్లో క్షమాబిక్షలకు తావులేదని అన్నారు. దీంతో ఇక దోషులకు ఉరి శిక్ష త్వరలోనే విధిస్తారని వార్తలు కూడా వెలువడ్డాయి. అమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన అదే తేదీని వారిని ఉరి తీస్తారని కూడా సమాచారం.
ఈ నెల 16న ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఈ శిక్ష అమలు చేస్తున్నట్లు తెలిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని బాక్సర్ జైలు అధికారులకు పది ఉరి తాళ్లను సిద్దం చేయాలని ఆదేశాలు వెళ్లడంతో.. నిర్భయ దోషులకు కోసమేనని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఉరిశిక్షను అమలు చేసేందుకు తీహార్ జైలులో తలారీ కూడా లేరిని సమాచారం. తాజాగా నిర్భయ ఘటనలో దోషులకు ఉరిశిక్షను అమలు చేసేందుకు ఎట్టకేలకు తలారి దొరికాడు. తీహార్ జైలులో తలారి లేకపోవడంతో ఉరి తీయడానికి ఏర్పాట్లు చేసేందుకు తలారిని పంపాలని జైలు అధికారులు ఉత్తర ప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టరు జనరల్ ను కోరారు.
దీంతో మీరట్ జైలులో తలారీగా పనిచేస్తున్న పవన్ కుమార్ అనే వ్యక్తిని తీహార్ జైలుకు తాత్కాలికంగా బదలీ చేశారు. గతంలో సీరియల్ కిల్లర్ సురేందర్ కోలీని ఉరి తీసింది పవన్ కుమారే. ప్రొఫెషనల్ తలారిగా గుర్తింపు పొందాడు. ఏ మాత్రం నొప్పి తెలియకుండా దోషిని ఉరితీయడం, ఒక్క క్షణంలోపే ప్రాణం పోయేలా జాగ్రత్తలు తీసుకోవడంలో పవన్ అనుభవశాలి. కాగా నిర్భయ ఘటనలో మొత్తం ఆరుగురు దోషుల్లో ఒకరు జూవైనల్ కోర్టు విధించిన శిక్ష అనుభవించాడు. మరో దోషి రామ్ సింగ్ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా నలుగురు దోషులకు తీహార్ జైలులోనే రిమాండ్ లో వున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more