దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైనదిగా పేర్కొంటూ.. దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక వాతావరణం అలుముకుంది. దీనిని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా అధికంగా వుండటం, వారంతా రోడ్డపైకి వచ్చి నిరసనలు, అందోళనలకు దిగడంతో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జపాన్ తో భారత్ ఏర్పాటు చేసుకున్న సమీక్ష సమావేశాన్ని కూడా గోహతి నుంచి హస్తినకు మార్చనున్నట్లు సమాచారం.
అందోళనలు సంఖ్య పెరగడంతో అవి హింసాత్మక రూపం దాల్చిన క్రమంలో నిరసనకారుల్ని చెదరగొట్టడంలో విఫలమైన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. గౌహతి పోలిస్ కమీషనర్ సహా మరో సీనియర్ అధికారి సహా పలువురు అధికారులపై రాష్ట్ర హోంశాఖ వేటు వేసింది. నిరసనకారుల్ని చెదరగొట్టడంలో వీరు పూర్తిగా విఫలమయ్యారన్న అభియోగాల నేపథ్యంలో గౌహతి పోలిస్ కమీషనర్ గా దీపక్ కుమార్ స్థానంలో మున్నా ప్రసాద్ గుప్తాను నియమించింది ఆ రాష్ట్ర హోంశాఖ.
అస్సోం శాంతిభద్రతలను పర్యవేక్షించే ఏడీజీపి ముఖేష్ అగర్వాల్ ను కూడా బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో జీపీ సింగ్ ను తీసుకువచ్చింది. మరో ఏడీజీపి ఎల్ఆర్ విష్ణోయ్ ను కూడా బదిలీ చేసింది. వీరి స్థానంలో మరో ఏడీజీపీ ఎస్ఎన్ సింగ్, డిజీపి ఆనంద్ ఫ్రకాష్ తివారీలను తీసుకువచ్చింది. ఇక వీరు రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణలను పర్యవేక్షించనున్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది నిరసనకారులు కర్ఫ్యూను తోసిరాజుతూ వీధుల్లోకి వచ్చి అందోళనలు చేపడుతున్నారు.
నిరసనకారులు అందోళనలు తీవ్రస్థాయికి చేరకున్నాయి. డులియాజన్ లో ఉన్న కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్ తేలి నివాసంపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంట్లోని ఆస్తులు ధ్వంసమయ్యాయి. దిబ్రుగఢ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తేలి... నివాసంపై దాడి జరగక ముందే ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ నివాసంపై కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత ఫుకాన్, ఆ పార్టీ నేత సుభాష్ దత్తా నివాసాలపై కూడా దాడికి తెగబడ్డారు. మరోవైపు, ఆందోళనలతో అట్టుడుకుతున్న అసోంలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరింపజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more