Excellent Medicine to keep diabetes cholesterol in control కొలెస్ట్రాల్, డయాబెటిస్ వ్యాధులకు దివ్యౌషధం.. ఇదే..!

Speaking sanskrit keeps diabetes cholesterol at bay bjp mp

bjp sanskrit on sanskrit, ganesh singh bjp, ganesh singh sanskrit, ramesh pokhriyal nishank, Sanskrit Central Universities Bill 2019, Sanskrit Bill passed lok sabha, BJP MP, MP Ganesh Singh, Lok Sabha, Sanskrit, Diabetes, Cholesterol, US based Academic Institution, politics

Speaking during the debate on the Sanskrit Central Universities Bill, 2019, in the Lok Sabha, Singh claimed as per a research done by a US-based academic institution, speaking in Sanskrit can have a number of health benefits.

ITEMVIDEOS: కొలెస్ట్రాల్, డయాబెటిస్ వ్యాధులకు దివ్యౌషధం.. ఇదే..!

Posted: 12/13/2019 05:21 PM IST
Speaking sanskrit keeps diabetes cholesterol at bay bjp mp

చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్న తెలుగు నానుడి గుర్తుందా.? అదే పాటించారా.? ఈ పార్లమెంటు సభ్యుడు అన్న అనుమానాలు కలగకమానవు. ఔనండీ సాక్ష్యాత్తు చట్టసభలో అందులోనూ లోక్ సభలో అందరు సభ్యులు వున్న సమయంలో పార్లమెంట్ లో చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపాయి. అంతేకాదు చర్చకు కూడా దారి తీసాయి. జిహ్వలకు రోగాలకు అవినాభావ సంబంధం వుందని తెలుసు. కానీ ఏకంగా జిహ్వ పలికే బాషతోనూ వ్యాధులు నయం అవుతాయని, నియంత్రణలో వుంటాయంటూ చర్చకు తెరలేపారు.

దేశంలో సంస్కృత విశ్వవిద్యాలయాల ఆవశ్యకత ఎంతైనా వుందని.. గుర్తించిన కేంద్రం ఈ మేరకు ఒక ప్రతిపాదిత బిల్లును తీసుకువచ్చింది. దానిని పార్లమెంటులో పెట్టగా.. లోక్ సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపి పార్లమెంటు సభ్యుడు గణేష్ సింగ్ మాట్లాడుతూ..  రోజూ సంస్కృతంలో మాట్లాడితే షుగర్ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. ఈ మేరకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు. దీనికి వివరణ కూడా గణేష్ సింగ్ ఇవ్వడం గమనార్హం.

సంస్కృతం మాట్లాడడం ద్వారా నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుందన్నారు. ఇస్లామిక్ భాషలతో సహా ప్రపంచంలోని 97 భాషలకు సంస్కృతమే ఆధారమన్నారు. అంతేకాదు.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సంస్కృతంలో జరిపితే సిస్టమ్ ఆగకుండా పనిచేస్తుందన్నారు. ఇప్పటికే నేతల నోరుజారడంపై సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల కూడా నోరుజారి బుక్కయ్యారు. ఆమెపై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ పడ్డాయి. తాజాగా బీజేపీ ఎంపీ మాటలతో నవ్వులపాలు అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MP  MP Ganesh Singh  Lok Sabha  Sanskrit  Diabetes  Cholesterol  US based Academic Institution  politics  

Other Articles