విజయవాడ ఆయేషా మీరా దారుణహత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. పుష్కరకాలం నిండిన ఈ కేసులో ఇప్పటికీ అసలైన నిందితులను పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో ఈ కేసు విచారణను సిబిఐకి రాష్ట్రోన్నత న్యాయస్థానం అప్పగించింది. అనేక మలుపులు, ట్విస్టులు తిరిగిన ఈ కేసులో చివరకు న్యాయస్థానంలో భద్రంగా వుండాల్సిన ఆధారాలు కూడా కనుమరుగు కావడంతో.. ఈ కేసును పునఃధర్యాప్తు చేయాలని హైకోర్టు సిబిఐకి కేసును అప్పగించింది.
కాగా, ఈ కేసులోని మృతురాలు అయేషా మీరా తల్లి షంషాద్ బేగం అధికార పక్షానికి చెందని మహిళా ఎమ్మెల్యే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు నిందితులు ఎవరో తెలుసునని అమె అరోపించారు. అయేషా మీరా హత్య జరిగినప్పుడు తమకు మద్దతుగా నిలిచిన రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని షంషాద్ బేగం నిలదీసారు. నాడు తమ పక్షాన నిలబడి పోరాడిన రోజా.. ఇప్పుడు అసలు స్పందించటం లేదన్నారు. తాము తొలి నుండి ఆరోపిస్తున్నట్లుగా హత్యకు కారకులు ఎవరో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యలు చేసారు.
ఒక వర్గం వారి పైన దాడులు జరిగితేనే స్పందిస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో ఆయేషా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసారు. రీపోస్టుమార్టం తమ మత ఆచారాలకు విరుద్ధమని... అయినప్పటికీ కేసు విచారణ ముందుకు సాగేందుకు రీపోస్టుమార్టంకు ఒప్పుకున్నామన్నారు. తమ కుమార్తె హత్య కేసులో దోషులకు శిక్ష పడాలనే ఇందుకు అంగీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 21 రోజుల్లో నిందితుల్ని పట్టుకుంటామన్న సీఎం జగన్... ఆయేషా కేసును కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. దేశంలో న్యాయం ఉందన్న నమ్మకం లేదని బేగం ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంకోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు.
2007 డిసెంబర్లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా దారుణహత్య జరిగింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ... అసలు దోషులెవరో బయటపడలేదు. ఈ హత్య జరిగినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా వున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more