Re-Autopsy to ayesha’ Body తల్లిదండ్రులు.. సీబిఐ సమక్షంలో అయేషా రీ-పోస్టుమార్టం..

Ayesha meera body exhumed for autopsy 12 years after murder

Ayesha Meera, Ayesha Meera case, Ayesha Meera re-postmortem, Ayesha Meera ,latest, Ayesha Meera updates, Ayesha Meera case news, Ayesha Meera CBI, CBI in Ayesha Meera case, CBI about Ayesha Meera, CBI Sensational Move in Ayesha Meera Case, Andhra Pradesh, Politics, Crime

Twelve years after the rape and murder of B-Pharmacy student Ayesha Meera at a hostel here, the CBI on Saturday exhumed her body for fresh autopsy. A team of forensic experts from Delhi were conducting the autopsy at the graveyard in Tenali town of Guntur district of Andhra Pradesh.

తల్లిదండ్రులు.. సీబిఐ సమక్షంలో అయేషా రీ-పోస్టుమార్టం..

Posted: 12/14/2019 12:33 PM IST
Ayesha meera body exhumed for autopsy 12 years after murder

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 27, 2007న అర్థరాత్రి జరిగిన దారుణ ఘటన అది. విజయవాడ ఇబ్రహీపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్ లో జరిగిన ఆయేషా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బి.ఫార్మసీ చదవుతున్న అయేషా మీరా శరీరంపై పదునైన ఆయుధంతో గాయపర్చినట్లుగా పలు చోట్ల గాయాలున్నాయి. అంటే అమెపై ఎవరో ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యంతోనే ఈ దారుణహత్యకు ఒడిగట్టారన్న అనుమానాలు రేగాయి. కానీ పుష్కరకాలం దాటిన తరువాత కూడా ఇంకా ఈ కేసులో అసలైన నిందితులెవరో తెలియదు.

మొదటి నుంచి అనేక మలుపులు, ట్విస్టులు తీసుకున్న ఈ కేసులో సత్యంబాబును నిర్ధోషిగా తేల్చిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు.. అసలు దోషులను పట్టుకునేందుకు  కేసును సిబిఐ అప్పగించింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీబిఐకి అన్ని అవరోధాలే ఏర్పడ్డాయి. నిందితులు ఎవరన్న విషయాన్ని తేల్చేపనిలో నిమగ్నమైన సీబిఐ అధికారులు.. ఘటన జరిగిన క్రమంలో సేకరించిన ఆధారాలను పరిశీలించాలని భావించారు. కాగా న్యాయస్థానంలో భద్రపర్చిన ఆధారాలు కూడా అదృశ్యమయ్యాయి. దీంతో సీబిఐ ఈ కేసులో 12 ఏళ్ల తరువాత మృతురాలి మృతదేహాన్ని బయటకు తీసి మరోమారు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే న్యాయస్థానం నుంచి అనుమతులు పొందిన సీబిఐ.. అయేషా మీరా తల్లిదండ్రుల సమక్షంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ పోస్టుమార్టం నిర్వహహించారు, అమె మృతదేహంలోని పలు బాగాలను సేకరించిన అధికారులు అమెను ఖననం చేసిన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చెంచుపేటలోని ముస్లిం శ్మశానవాటికలోనే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీబీఐ అధికారులు అదేశానుసారం సంబంధిత విభాగాల అధికారులు శ్మశానవాటికను చేరుకుని పోస్టుమార్టం నిర్వహించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayesha Meera  Re-Autopsy  Ayesha case Accused  CBI  Ayesha parents  Satyam babu  Guntur  Andhra Pradesh  Politics  Crime  

Other Articles