విశాఖపట్టణంలో నిర్వహించిన ‘కాపుల ఆత్మీయ కలయిక’ సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి పరాభవం ఎదురైంది. తాదివరకెన్నడూ ఎరుగని, ఊహించని అనుభవం కావుల ఆత్మీయ కలయికలో ఆయన చవిచూశారు. జిల్లాలోని కండాల కొండలో కాపులు ఆత్మీక కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు విజయసాయిరెడ్డి, పలువురు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు.
విజయసాయిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలను చూసిన కాపులు మండిపడ్డారు.ఉన్నఫలంగా విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అంతేకాదు ‘జై కాపు.. జైజై కాపు’ అని నినదించారు. కాపుల సమావేశానికి వైసీపీ నేతలందరూ ఎలా వస్తారని కార్యక్రమానికి వచ్చిన ఇతర నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. దీంతో కార్యక్రమంలో కొంతసేపు రసాభసగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవిలో ఉండడం వల్లే సహనంగా ఉన్నానని తీవ్ర స్వరంతో అన్నారు. జిల్లా నుంచి తనకు మాత్రమే మంత్రి పదవి దక్కిందన్నారు.
కాగా, పలువురు నేతలు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడగా మంత్రి అవంతి అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో అటువంటివి మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు విజయసాయిరెడ్డి కాపు సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. తానూ కాపునేనని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రేపు తాను చనిపోయినప్పుడు తన డెత్ సర్టిఫికెట్ మీద కూడా అదే ఉంటుందన్నారు. అయినా ఆయన మాటలను అలకించేందుకు కొందరు కాపులు సుముఖంగా లేకపోవడంతో.. ఆయన బదులుగా అవంతి మాట్లాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more