chicken prices down in hyderabad చికెన్ ప్రియులూ.. ఇక లాగించేయరూ..

Good news to chicken lovers as prices slashed to year low

chicken, chicken production, chicken demand, chicken sales, Ayyappa season, chicken prices slashed, Hyderabad, Telangana, crime

chicken prices slashed to year low in hyderabad as demand is less than production due to Ayyappa season. The average sale of a week is also decresed in this season.

చికెన్ ప్రియులూ.. ఇక లాగించేయరూ..!

Posted: 12/16/2019 05:04 PM IST
Good news to chicken lovers as prices slashed to year low

చికెన్‌ ప్రియులకు శుభవార్త. ధరలు భారీగా తగ్గిపోయాయి. ఆదివారం వచ్చిందంటే చికెన్‌ ప్రియులకు కోడి కూర వండందే ముద్ద దిగదు. చికెన్‌ బిర్యాని, చికెన్‌ కరి ఉంటే చాలు లొట్టలేసుకుని రెండు ముద్దలు ఎక్కువగా ఆరగించేస్తారు. కానీ చలి తీవ్రతతో పాటు అయ్యప్ప భక్తుల సీజన్ కావడంతో నగర జనం చికెన్‌ వైపు ఆసక్తి చూపడడం లేదు. దీంతో డిమాండ్‌ కంటే కోళ్ల ఉత్పత్తి ఎక్కువ కావడం ఫలితంగా ధరలు తగ్గాయి. గత వారం రోజుల్లో ఈ ఏడాదిలో అతి తక్కువ ధరలు నమోదయ్యాయి.

లైవ్‌ చికెన్‌ హోల్ సేల్‌ ధర కిలో రూ.82 నుంచి రూ. 92 మధ్య ఉంది. చికెన్‌ ధర కూడా విపరీతంగా తగ్గింది. కిలో చికెన్‌ రూ. 150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. ఉత్పత్తికి సరిపడా అమ్మకాలు లేకపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. ఇక నగర వ్యాప్తంగా లక్ష కిలోలకు అటు, ఇటుగానే విక్రయాలు సాగుతున్నాయి.

ఇతర రోజులతో పోల్చితే  వినియోగం సగానికి సగం తగ్గింది.  పలు కోళ్ల ఫారం వ్యాపారులు ప్లానింగ్‌ చేసుకోని కోళ్లను పెంచుతారు. అయితే కోళ్ల విక్రయాల్లో దాదాపు 30 శాతం తగ్గడంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కార్తీక మాసం ముగియడంతో పాటు అయ్యప్ప దీక్షలు ప్రారంభ, చలి తీవ్రత నేపథ్యంలో ఈ నెల మొదటివారం నుంచే చికెన్‌ వినియోగం గణనీయంగా తగ్గింది. నగరంలో ఇతర రోజులతో పోల్చితే  వినియోగం సగానికి సగం తగ్గింది. మాములు రోజుల్లో 80 కిలోల వ్యాపారం జరిగితే  గత వారంలో 30కిలోలు కూడా మించలేదని వ్యాపారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles