దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులోని నిందితుల మృతదేహాలకు ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్స్ నిపుణుల బృందం శాస్త్రీయ పద్దతిలో పోస్టుమార్టం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అదేశాలు మేరకు నిపుణులు పూర్తి పోస్టుమార్టం ప్రక్రియకు సంబంధించిన వీడియోను చిత్రీకరించారు. న్యాయస్థానం అదేశాలతో రీపోస్టుమార్టం పూర్తైన తరువాత నిందితుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్ తరువాత వారి స్వస్థలాలకు మృతదేహాలను తీసుకువెళ్లిన పోలీసులు.. ఈ ఎన్ కౌంటర్ పై అనుమానాలు వున్నాయంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలు కావడంతో న్యాయస్థానం అదేశాలమేరకు నాలుగు మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే భద్రపర్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్య నిపుణులు గాంధీ ఆసుపత్రిలో రీపోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేశారు. అంతకుముందు మృతదేహాలకు ఎక్స్ రే తీశారు. కాగా, నివేదిక వివరాలను సీల్డ్ కవర్ లో కోర్టులో సమర్పించనున్నారు.
అనంతరం నాలుగు మృతదేహాలను వారి కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. రెండు అంబులెన్స్ లలో మృతదేహాలను వారి గ్రామాలకు తరలించారు. ఈరోజే మృతదేహాలకు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. మృతుల కుటుంబీకుల సమక్షంలోనే ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టంను నిర్వహించారు. ఎయిమ్స్ బృందమే ఈ వీడియో చిత్రీకరణ జరిపినట్టు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. మరో రెండు రోజుల్లో రీపోస్టుమార్టం రిపోర్టును ఎయిమ్స్ వైద్యులు హైకోర్టుకు అందించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more