జార్ఖాండ్ ఎన్నికల్లో మహాకూటమికి అనుకూలంగా తీర్పునిచ్చిన ప్రజలకు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ గ్రాఫ్ దేశవ్యాప్తంగా పడిపోతుందనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని అన్నారు. బీజేపీపై మూడు 'డీ'లతో కూడిన 'త్రీడీ' సెటైర్ విసిరారు. డెంటెడ్, డినైడ్, డిఫీటెడ్ ( దెబ్బతినింది, వద్దనుపించుకుంది, ఓడిపోయింది) అనే పదాలను చిదంబరం ప్రయోగిస్తూ చేసిన సెటైర్ హల్ చల్ చేస్తోంది.
'హర్యానాలో దెబ్బతిన్నారు (డెంటెండ్), మహారాష్ట్రాలో వద్దనిపించుకున్నారు (డినైడ్), జార్ఖాండ్‌లో ఓడిపోయారు (డిఫీటెడ్) ' అంటూ చిదంబరం ట్వీట్ చేశారు. జార్ఖాండ్‌లో ఇంత ఘనవిజయం అధించిన ప్రజలకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 'హర్యానాలో వాళ్లు (బీజేపీ) కొద్దిపాటి లీడింగ్‌తో గెలిచారు. మహారాష్ట్రలో దొడ్డిదారిన అధికారం దక్కించుకోవాలని ప్రయత్నించారు. కానీ క్రమంగా వాళ్లు కిందకు జారిపోతూనే ఉన్నారు' అని చిదంబరం బీజేపీపై సెటైర్ వేశారు.
ఇక జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి పార్టీలకు రాష్ట్ర ప్రజలు స్పష్టమైన అధికత్యను అందించడంతో.. ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన ఆయన బీజేపిపై విమర్శనాస్త్రాలను సంధించారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో ఓడిపోయారంటూ.. క్రమంగా దేశవ్యాప్తంగా మీ గ్రాఫ్ పడిపోతుందని ఆయన చురకలంటించారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకి అవసరమైన 41 సీట్లను జేఎఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి దాసేంది. 47 సీట్లను కైవసం చేసుకుంది, (జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1). కాగా అధికార బీజేపి కేవలం 25 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, జేవీఎం 3, ఏజేఎస్యూ 2, సీపీఐ 1, ఎన్సీపీ 1, స్వతంత్రులకు 2 సీట్లు దక్కాయి.
తండ్రికి విజయాన్ని అంకితమిచ్చిన హేమంత్ సోరెన్
జేఎంఎం-కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు జేఎంఎం నేత, కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ విజయం ఒక మైలురాయి అని అన్నారు. ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చిన జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలని అన్నారు. ఈ విజయాన్ని తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కు అంకితం చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్, ఇతర నేతలందరికీ తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
'దిషోం గురు శిబు సోరెన్ చేసిన కఠోర శ్రమ, పోరాటం ఫలితమే ఈ విజయం. రాష్ట్రం ముందున్న లక్ష్యాలను సాధించుకునే సమయమిది. జార్ఖండ్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ విజయం ఓ మైలురాయి. సమాజంలో వర్గాలు, కులాలకు అతీతంగా అందరి అంచనాలు, కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నాను. దీనిపై త్వరలోనే భాగస్వామ్య పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తాను' అని హేమంత్ సోరెన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more