మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. రాష్ట్రానికి మూడు రాజధానుల విషయమై సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గ భేటీ సుదీర్ఘ సమావేశం మూడు గంటల పాటు సాగింది. అమరావతిలోని సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో పలు అంశాలపై క్యాబినెట్ చర్చించింది. వీటిలో రాజధానితో సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫార్సులు చేసిన జీఎన్‌రావు కమిటీ నివేదికపై కేబినెట్ సమగ్రంగా చర్చించామని మంత్రి కన్నబాబు తెలిపారు.
ఈ బేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మూడు రాజధానుల అంశంమై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై క్యాబినెట్ మీటింగ్ లో సుదీర్ఘ చర్చ జరిగిందని అన్నారు. అయితే బీసీజీ నివేదిక కూడా రావాల్సివున్న క్రమంలో అన్నింటినీ పరిగణలోకి తీసుకుని చర్చ జరిగిందని.. అయితే సమావేశ వివరాలను పౌరసమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు అందిస్తారని తెలిపారు. ఈ తరుణంలో జీఎన్‌రావు కమిటీ నివేదికను క్యాబినెట్ కమిటీ యథాతథంగా ఆమోదిస్తుందా? లేదా మార్పులేమైనా చేస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
రాజధాని అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గన నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి నివేదిక అందజేసింది. కాగా, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత పది రోజులుగా నిరసనలు, అందోళనలు చేపట్టిన అమరావతి రైతులు మంత్రివర్గ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నదనే అంశంలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇవాళ మంత్రివర్గ సమావేశం సమయంలో రాజధాని పరిధిలోని అనేక గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది.
రాజధానిని మార్చవద్దంటూ గొల్లపూడి వద్ద ధర్నా చేసిన రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. గొల్లపూడి-1 సెంటర్ వద్ద తెదేపా నేత దేవినేని ఉమ నిరసన చేపట్టారు. రైతులతోపాటు రహదారిపై ఉమ బైఠాయించారు. పోలీసులు దేవినేనితోపాటు పులువురు నేతలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. దీంతో నిరసనకారులు పోలీసుల చర్యను నిరసిస్తూ ఆందోళనలను ఉద్ధృతం చేశారు. అటు వెలగపూడిలోనూ రైతుల దీక్ష ఉద్రిక్తంగా మారింది.
వెలగపూడిలో రైతుల ఆందోళనలో సర్కిల్ ఇన్స్ పెక్టర్, ఎస్ఐలకు గాయాలయ్యాయి. కారు వెళ్లనీయకుండా అడ్డుకున్న గ్రామాస్థులను చెదరగొట్టే క్రమంలో అందోళనకారులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. కారుకు రక్షణగా వున్న సీఐ, ఎస్ఐలను తోసిన అందోళనకారులు కారును ధ్వంసం చేయడంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి. ఒక వైపు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుండగా.. మరోవైపు మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి రైతులు, మహిళలను ఆందోళన చేపట్టారు.
ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం త్యాగాలు చేస్తే.. ఆ త్యాగాలను అవమానించేలా రాజధానిని మారుస్తారా? అంటూ వారు అమరావతి రైతులు మండిపడుతున్నారు. కేవలం అసెంబ్లీని అమరావతిలో ఉంచితే లాభమేంటని, పూర్తి స్థాయి రాజధాని ఇక్కడే కొనసాగించాలని పట్టుబడుతున్నారు. అందోళన చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ కారును చుట్టుముట్టిన మహిళలు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన పార్టీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేసి పెదకాకాని స్టేషన్‌కు తరలించారు. శాంతియుత నిరసనలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మందడంలో నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో మహిళలంతా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎర్రబాలెంలోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రోడ్డుపై టైర్లు కాల్చి రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని అంశంపై తీరు మార్చుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more