మూడు రాజధానుల ప్రతిపాదనలపై యావత్ రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న క్రమంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ అంశంమై సుదీర్ఘచర్చకు తెరలేపిందని.. ఈ అంశంలో కీలక నిర్ణక్ష్ం కూడా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌర, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని క్యాబినెట్ సమావేశ నిర్ణయాలను వెల్లడిస్తూ తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ది, రాజధాని ఏర్పాటు విషయంలో హైపవర్ కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చించామని, ఈ కమిటీ గతంలోని శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన అద్యాయనాలను కూడా పరిశీలించి.. పరిగణలోకి తీసుకుని తమ నివేదికను అందించిందని మంత్రి తెలిపారు.
ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి పోందిన మహానగర నిర్మాణాల అనుభవం కలిగిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బిసిజీ) నివేదిక అందించిన కూడా జనవరి తొలివారంలో క్యాబినెట్ ముందుకు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీటిపై మంత్రులు, సీనియర్ ఐఏఏస్ అధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయనునన్నామని తెలిపారు. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసిన తరువాత హైపవర్ కమిటీ అందించే నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రకటన చేస్తుందని మంత్రి తెలిపారు.
దీంతో పాటు కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. కొత్తగా 108 వాహనాల కొనుగోలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. 412 వాహనాల కొనుగోలుకు రూ.78 కోట్లు కేటాయించేందకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాలకు మద్దతు ధర ముందే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి వీలుగా కృష్ణపట్నం పోర్టు ముఖద్వారం కుదించనున్నట్లు తెలిపారు.
రాజధాని నిర్మాణంలో జరిగిన అక్రమాలను ఆర్థిక మంత్రి బుగ్గన నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించిందని.. వాటిపై న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయాలు ఉంటాయన్నారు. ఈ వ్యవహారాన్ని లోకాయుక్త, సీబీఐ, సీబీసీఐడీల్లో దేనికి అప్పగించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మంత్రి నారాయణ కమిటీ నివేదిక ఆధారంగా మొత్తంగా 52 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. అయితే ఇందుకు రూ.లక్షా 9వేల కోట్ల పెట్టుబడులు అవసరమని భావించి కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సంక్షేమం కూడా ముఖ్యమని భావించే ప్రభుత్వం తమదని అందకనే జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై హైపవర్ కమిటీ వేసి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more