YS Jagan is an egoist and a failed CM: Kanna వైఎస్ జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం: కన్నా

Relocation of ap capital will be a retrograde step says kanna

Kanna Laxmi Narayana, BJP, AP President, YS Jagan, Three Capitals, Amaravati, Amaravati Bandh, !44 Section, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati project cost, regional imbalance in India, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Andhra Pradesh, Politics

BJP State President Kanna Lakshmi Narayana who opposed Chief Minister's proposal of evicting the AP capital from Amaravati took a dig at Jagan once again. Kanna alleges that Jagan inexperienced and lacks understanding moreover, he has eco as well. And termed him as failed CM of ever in Andhra Pradesh.

ఐదేళ్లలో కనీసం శంకుస్థాపనలు కూడా చేయలేరు: రాజధానులపై కన్నా

Posted: 12/30/2019 10:59 AM IST
Relocation of ap capital will be a retrograde step says kanna

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సీడ్ క్యాపిటల్ గా అమరావతినే కొనసాగించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రానున్న ఐదేళ్ల కాలంలో మూడు రాజధానులకు కనీసం శంకుస్థాపనలు కూడా చేయలేరని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2014లో అప్పటి ప్రభుత్వం ఫలానా చోట రాజధాని నిర్మించాలనుకుని, తీర్మానం చేసి ప్రధానమంత్రిని నమ్మించారని తెలిపారు. నాడు రాజధానిపై చేసిన తీర్మానంలో జగన్ కూడా భాగస్వామి అని, ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపితే ప్రధాని దాన్ని నమ్మి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారని వివరించారు.

కానీ ఇప్పుడు రాజధానిని మార్చుతుంటే న్యాయపరమైన పోరాటానికైనా తాము సిద్ధమేనని అన్నారు. "జగన్ కు అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యానికి తోడు ఇగోయిజం కూడా ఉంది. వీటన్నింటికి తోడు ఆత్రం! ఇవన్నీ కలిసి జగన్ ను ఈ ఆర్నెల్లలో విఫల సీఎంగా నిలిపాయి. జగన్ ఇప్పుడొచ్చి విశాఖను అభివృద్ధి చేసేదేమీ ఉండదు. ఇప్పటికే విశాఖ ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడేదో సచివాలయం నిర్మించినంత మాత్రాన అభివృద్ధి చెందదు. నాకు తెలిసినంతవరకు వచ్చే ఐదేళ్లలో జగన్ శంకుస్థాపన కూడా చేయలేరు" అంటూ వ్యాఖ్యానించారు.

గత ఎన్నికలకు ముందు తమ పార్టీ కూడా అవకాశం ఇస్తే అమరావతిలో అధునాతన రాష్ట్ర రాజధానిని నిర్మిస్తామని హామీని ఇచ్చిందని.. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి వుంటామని చెప్పారు. రాష్ట్రంలో సీడ్ క్యాపిటల్ ఒక్క చోట మాత్రమే ఉండాలని పేర్కోన్న ఆయన అయితే తాము అభివృద్ది వికేంద్రీకరణ కోరుకున్నామని చెప్పారు. అందులో భాగంగా కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలని మాత్రమే కోరుకున్నామని వివరించారు. రాష్ట్రంలోని జగన్ సర్కారు మాత్రం అభివృద్ది వికేంద్రీకరణను, పరిపాలన వికేంద్రీకరణగా మార్చివేసేలా నిర్ణయం తీసుకుంటోందని కన్నా విమర్శించారు.

చంద్రబాబు తమతో ఉంటూనే తమను దోషిగా నిలబెట్టాడని, 2014 నుంచి 2019 వరకు ఏపీ బీజేపీకి చీకటిరోజులని కన్నా పేర్కొన్నారు. నిజమేంటో తెలిసిన రోజున ప్రజలు బీజేపీతోనే ఉంటారని ధీమాగా చెప్పారు. స్థానిక బీజేపీ నేతలు భిన్నస్వరాలు వినిపిస్తుండడం పట్ల స్పందిస్తూ, ఏపీ బీజేపీ నేతల నిర్ణయంతో కేంద్ర నాయకత్వ నిర్ణయంగా భావించరాదని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్ర బీజేపీ వ్యతిరేకిస్తుందని, దీనికి బీజేపీ అధినాయకత్వంతో సంబంధంలేదని స్పష్టం చేశారు. ఏపీలో రాజధాని మార్పు నిర్ణయం జరిగితే మాత్రం బీజేపీ చూస్తూ ఊరుకోదని కన్నా లక్ష్మీనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles