కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతిపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్జే తీవ్రంగా మండిపడ్డారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలకు చెందిన వ్యక్తులపై విమర్శలు చేసి తమ పదవులను కాపాడుకోవాలని యోచించే అతి దిగజారుడు తనానానికి పాల్పడుతుంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ తన పేరును 'ఫిరోజ్ ప్రియాంక'గా మార్చుకోవాలంటూ వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి నిరంజన్ జ్యోతిపై ఫైర్ అయిన ఖార్గే.. సభ్యత, సంస్కారం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వీరు.. ప్రతిపక్ష నేతలపై చేసే దిగజారుడు విమర్శలే వారి స్థాయిని, ఔచిత్యాన్ని తెలిపుతాయని చురకలంటించారు.
మంచి మర్యాదలకు తిలోదకాలిచ్చేన నేతలు కూడా ఇలాంటి చౌకబారు విమర్శలు చేయరని అన్నారు. గాంధీ కుటుంబంపై నోటికొచ్చినట్టు మాట్లాడి వార్తల్లో ఉండాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో ఖర్గే మాట్లాడుతూ, 'వాళ్లు ఎప్పుడూ అలాంటి అసహ్యమైన స్టేట్మెంట్లే చేస్తారు. వాళ్లకు సభ్యత, సంస్కారం లేవు. మంచీమర్యాద తెలియని మంత్రులంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. గాంధీ, నెహ్రూ కుటుంబానికి వ్యతిరేకంగా ఎప్పుడూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంతారు' అని అన్నారు.
ఈ దేశానికి గాంధీ కుటంబం చేసిన త్యాగాలు ఎవరూ మరిచిపోలేరని అన్నారు. త్యాగాల గురించి ఆమెకు ఏమి తెలుసునంటూ నిరంజన్ జ్యోతిపై నిప్పులు చెరిగారు. 'గాంధీ, నెహ్రూ కుటుంబాలు దేశం కోసం ఎలాంటి త్యాగాలు చేశారో వాళ్లకెంత (బీజేపీ నేతలు) మాత్రం తెలియదు. పైగా మంచీ మర్యాద లేని ప్రకటనలు చేస్తుంటారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని ఖర్గే అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కేంద్ర మంత్రి తన బుద్ధి ఎలాంటిదో చాటుకుందని అన్నారు.
ప్రియాంక గాంధీ తనకోసం తాను ఆందోళన చేయలేదని, నిజమైన సమస్యల గురించి చెప్పుకోలేని వారి గోడునే ప్రియాంక వినిపించారని, ఇందుకు భిన్నంగా బీజేపీ వాళ్లు తమ నోటికొచ్చిన భాషలో ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతుంటారని అన్నారు. దీనికి ముందు, ప్రియాంకపై నిరంజన్ జ్యోతి విమర్శల దాడి చేస్తూ, ఆమె 'నకిలీ గాంధీ' అని, కాషాయం గురించి అవగాహన లేదని, ఆమె తన పేరును ప్రియాంక గాంధీకి బదులు 'ఫిరోజ్ ప్రియాంక'గా మార్చుకోవాలని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more