ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్లు సురక్షితంగా వున్నారు. ఈశాన్యభారతంలోని సిక్కిం రాష్ట్రంలో వారు వున్నట్లు సందేహించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో దేశరాజధాని ఢిల్లీలో ఇద్దరు వైద్యుల అదృశ్యమయ్యారంటూ వస్తున్న కథనాలకు తెరపడింది. దిలీప్, హిమబిందులు సిక్కింలో చిక్కారని, సోషల్ మీడియా, వారి ఫోన్ నంబర్ల ట్రాకింగ్ ఆధారంగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అయితే వీరు అదృశ్యమైన నేపథ్యంలో అసలు కారణమేంటని కనుగొనే పనిలో పడ్డారు పోలీసులు.
భర్తను వదిలేయాలని నిర్ణయించుకున్న హిమబిందు, తన సహచర విద్యార్థి, డాక్టర్ వృత్తిలోనే ఉన్న దిలీప్ తో కలిసి వెళ్లినట్టు ప్రాథమికంగా నిర్దారించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. విచారణ అనంతరం వారిద్దరినీ స్వస్థలానికి తరలించనున్నారు. కాగా, ఐదు రోజుల క్రితం చర్చ్ కి వెళ్లి వస్తామని చెప్పిన హిమబిందు, దిలీప్ లు అదృశ్యమైన సంగతి తెలిసిందే. తన భార్య స్నేహితుడైన దిలీప్ తో కలిసి వెళ్లిందని, ఆపై ఇద్దరి సెల్ ఫోన్లూ స్విచ్చాఫ్ వచ్చాయని హిమబిందు భర్త, డాక్టర్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు, కేసును సీరియస్ గా తీసుకున్నారు.
చండీగఢ్ లో పీడియాట్రిషియన్ గా పనిచేస్తున్న దిలీప్, ఓ ఇంటర్వ్యూ నిమిత్తం వచ్చి, ఢిల్లీలోని శ్రీధర్, హిమబిందు దంపతుల ఇంట్లో దిగారు. వీరంతా గతంలో కర్నూలు మెడికల్ కాలేజిలో కలిసి చదువుకున్నారు. దీంతో వారి మధ్య వున్న సన్నిహిత్యంతో తమ ఇంట్లో వుండేందుకు శ్రీధర్ అంగీకరించాడు. 25న క్రిస్మస్ సందర్భంగా చర్చ్ కి వెళుతున్నానని భర్తకు ఫోన్ లో చెప్పిన హిమబిందు, ఆపై అదృశ్యం అయింది. దీంతో శ్రీధర్ వారి ఆచూకీ కనిపెట్టాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్లను అభ్యర్థించారు. అయితే అప్పటికే హిమబింధుతో దిలీప్ ప్రేమ ట్రాక్ వుందా.? లేకపోతే అతనితో కలసి ఎందుకు వెళ్లింది.? మరీ భర్తను ఎందుకు మోసం చేసింది.? అన్న ప్రశ్నలకు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more