Millennium Towers in Vizag likely to be AP Secretariat మిలినియమ్ టవర్స్ ఇక ఏపీ సెక్రటేరియట్.?

Millennium towers in vizag likely to be andhra pradesh secretariat

Secretariat, Millennium Towers, IT Hill No.3, accommodation, ministers, IAS, IPS, bureaucracy, visakhapatnam, Andhra pradesh, Polictics

Millennium Towers located at IT Hill No.3 in Visakhapatnam likely to become Secretariat of Andhra Pradesh. About 1.5 lakh square feet is available with readymade interiors and plug and play facilities.

విశాఖలోని మిలినియమ్ టవర్స్ ఇక ఏపీ సెక్రటేరియట్.?

Posted: 01/08/2020 06:38 PM IST
Millennium towers in vizag likely to be andhra pradesh secretariat

ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖకు కొత్త సోగబులు వచ్చిచేరుతున్నాయి. పరిపాలనా  రాజధానిగా  ప్రతిపాదించిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తోంది. పరిపాలనా రాజధానిగా విశాఖను చేసుకోవాలన్న ఆలోచనకు ముందే పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. పరిపాలనకు కావాల్సిన భవనాలు, మౌలిక వసతులు .. అన్ని కూడా అనుకున్నదే తడువుగా రంగంలోకి దిగేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఎక్కడ పెట్టాలి.. సెక్రటేరియట్ ను ఎక్కడ నుంచి నడపాలి అన్న కీలకాంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన ప్రభుత్వం, ఈ దిశగా చర్యలు చేపడుతోంది.

ప్రభుత్వ ఆఫీసులు, భూముల కోసం రాష్ట్రస్థాయి అధికారులు ఆ నగరంలో అన్వేషణ ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల ఆఫీసులకు అనువైన భవనాల కోసం అమరావతి నుంచి విశాఖకు వచ్చిన అధికారులు భవనాల వివరాలను సేకరించారు. తాత్కాలికంగా కార్యాలయాలు ఏర్పాటుకు అనుకూలమైన భవనాలు ఎక్కడన్నాయి? శాశ్వతంగా ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని వారు పరిశీలిస్తున్నారు. ఇన్నోవేషన్ వ్యాలీ టవర్స్ లో కొంత భాగం ఖాళీగా ఉండటంతో దానిని పరిశీలించిన ఐటీ అధికారులు.. సీఎం కార్యాలయానికి అనుకూలమని, పక్కనే ఉన్న మిలీనియం టవర్‌ సెక్రటేరియట్ కు బాగుంటుందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ సంస్థల ప్రతినిధులతో అధికారులు భేటీ అయ్యారు. మధురవాడ ఐటీ హిల్స్‌లో ఉన్న భవనాలపైనా కూడా ఆరా తీశారు.

మిలీనియం టవర్సే ఇక సెక్రటేరియట్..!

విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులో ఉన్న రుషికొండ ఐటీ పార్కులో గత ప్రభుత్వం నిర్మించిన మిలీనియం టవర్ ను సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. ఈ భవనాన్ని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.145కోట్లతో నిర్మించారు. పది అంతస్థులతో, అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ భవనంలో 2లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలం ఉంది. దీనితోపాటు మరో 1.5లక్షల చ.అ. పార్కింగ్‌ సదుపాయం ఉంది. ఐటీ సంస్థల కోసం నిర్మించిన ఈ భవనాన్ని విదేశీ ఐటీ కంపెనీ కాండ్యుయెంట్‌కు నాటి సీఎం చంద్రబాబు కేటాయించారు.

2019 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ కంపెనీలో 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఖాళీ చేయించి, అందులో సీఎం క్యాంపు కార్యాలయం పెట్టవచ్చున్నది ప్రభుత్వ అలోచన. దీన్ని మిలీనియం టవర్‌-1గా వ్యవహరిస్తున్నారు. మిలీనియం టవర్  పక్కనే టవర్‌-2 పేరుతో మరో భవనాన్ని రూ.80 కోట్లతో నిర్మిస్తున్నా రు. దీనిలో ఇంకో లక్ష చదరపు అడుగుల నిర్మాణ స్థలం అందుబాటులోకి వస్తుంది. మిలీనియం టవర్‌కు ముందు అదేవరుసలో నాలుగేళ్ల క్రితం స్టార్టప్‌ విలేజ్‌ కోసం ఒక భవనాన్ని రూ.70 కోట్లతో నిర్మించారు. 50వేల చ.అ. నిర్మాణ స్థలం ఉంది. ఇవన్నీ రుషికొండ ఐటీ పార్కు హిల్‌ నం.3లో ఉన్నాయి.

ఐటీ హిల్‌ నం.2లో పలు ఐటీ కంపెనీలకు స్థలాలు కేటాయించగా, వాటిలో కొన్ని ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు. అవన్నీ వెనక్కి తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందంటున్నారు. అయితే రుషికొండ ఐటీ సెజ్ లో ఖాళీ భవనాలను ప్రభుత్వం తీసుకోవడం అంతా ఈజీ ప్రాసెస్ గా లేదు.  సెజ్ లోని భూములను గానీ, భవనాలను గానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటే దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉఁటుంది. కేంద్రం సెజ్ ఉన్న ప్రాంతాన్ని డీ నోటిఫై చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకునే వీలుంటుంది. అయితే ఇప్పుడు పరిశీలిస్తున్న ఇన్నోవేషన్ సెంటర్, మిలీనియం టవర్ .. ఈ రెండూ కూడా సెజ్ పరిధిలో లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చిక్కులు లేకుండా అనుకున్నదే తడువుగా వీటిని అధీనంలోకి తీసుకోని కార్యకలాపాలు ప్రారంభించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles