అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ సమితి కేంద్ర కార్యాలయాన్ని పోలీసులు మూసివేశారు. ఓ వైపు పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజధాని అమరావతి అందోళనలను అణిచివేస్తోందన్న విమర్శల వెల్లువెత్తుతున్న క్రమంలో.. పోలీసులు బాహాటంగానే ఇలాంటి చర్యలకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జేఏసీ కార్యచరణ సమితికి పోలీసులు తాళాలు వేసి పహారా ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. అంతకుముందు విజయవాడ నగరం నడిబొడ్డున బెంజి సర్కిల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించాలని అదేశాలు కూడా జారీ చేయడం చర్చకు తావిస్తోంది.
కార్యాలయం కోసం అద్దెకు ఇచ్చిన భవన యజమానికి మౌఖికంగా బెదిరింపులకు గురిచేయడంతో పాటు నోటీసు ఇచ్చి మరీ కళ్యాణమండపానికి అనుమతులు రద్దు చేసి చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయగలమంటూ పటమట పోలీసుస్టేషన్ సీఐ సురేష్ రెడ్డి నోటీసు జారీ చేశారు. అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా విజయవాడ కేంద్రంగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో 45 సంఘాల భాగస్వామ్యంతో జేఏసీని ఏర్పాటుచేశారు. రాజకీయ పార్టీలతోపాటు విద్యార్థి, ఉపాధ్యాయ, మహిళా కార్మిక సంఘాలు భాగస్వాములై.. విజయవాడ ధర్నాచౌక్ లో ఆందోళనలు చేస్తున్నారు.
దీనికి కేంద్ర కార్యాలయం కోసం బెంజిసర్కిల్ లో వేదిక కల్యాణ మండపాన్ని అద్దెకు తీసుకున్నారు. మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య తనయుడు చెన్నుపాటి వజీర్ ఈ కళ్యాణ మండపం యజమాని. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు వచ్చి కల్యాణ మండపం గేటుకు తాళాలు వేశారు. కార్యాలయానికి ఎలా అనుమతిచ్చారని మేనేజర్ ను ప్రశ్నించారు. వెంటనే ఖాళీ చేయించాలని హుకుం జారీచేశారు.
అయితే గురువారం ఉదయం చంద్రబాబు కార్యాలయానికి వస్తున్నారని తెలిసి పోలీసులు తిరిగి తాళాలు ఇచ్చి ఒక్కరోజే నడపాలని.. శుక్రవారం నుంచి అనుమతి లేదని హెచ్చరించారు. గురువారం ఉదయం 8 గంటలకు ఒక నోటీసు జారీ చేశారు. రాత్రికి తాళాలు వేశారు. ఈరోజు ఉదయం కార్యాలయం వద్దకు చేరుకున్న జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గేటుకు తాళం వేసి, కార్యాలయం వైపు ఎవరూ వెళ్లకుండా పహారా కాస్తున్నారు. సీఎం జగన్ ఇదే మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more