Shabana Azmi grievously injured in car accident రోడ్డు ప్రమాదంలో సీనియర్ నటి ఆజ్మీకి తీవ్రగాయాలు..

Actor shabana azmi injured in car accident on mumbai pune expressway

shabana azmi, shabana azmi car accident, shabana azmi injured, javed akhtar, mumbai-pune highway, mumbai-pune highway shabana azmi, mumbai news, filmy news, tragedy, tollywood, movies, Entertainment

Noted actor Shabana Azmi was injured Saturday after her car rammed into a truck from behind on the Mumbai-Pune expressway near Khalapur toll plaza. Azmi has been moved to Panvel’s MGM hospital. Their vehicle was hit by a truck while they were travelling from Pune to Mumbai.

రోడ్డు ప్రమాదంలో సీనియర్ నటి ఆజ్మీకి తీవ్రగాయాలు..

Posted: 01/18/2020 07:05 PM IST
Actor shabana azmi injured in car accident on mumbai pune expressway

బాలీవుడ్ ప్రముఖ, సీనియర్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న ఆమెకు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం ముంబై నుంచి పుణె కు వెళ్తున్న అమె కారును ముంబై-ఫూణే ఎక్స్ ప్రెస్ హైవేపై ఓ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కొల్హాపూర్ టోల్ ప్లాజా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టింది. అమెతో పాటు కారు డ్రైవర్ కూడా గాయాలయ్యాయి,

ప్రమాద సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరకుని అమెను పన్ వేల్ ఎంజీఎం అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ ను కూడా చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త జావేద్ అక్తర్ కూడా కారులోనే ప్రయాణిస్తున్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా.. కారు డ్రైవర్‌ స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది.

తన భర్త జావెద్ అక్తర్ 75వ జన్మదినాన్ని ముంబైలో ఘనంగా జరుపుకుని తిరిగి ఫూణేకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేడుకల్లో షబానా అజ్మీ ఆనందంగా గడిపారు. ఇంతలోనే ఊహించని ఘోరం జరిగింది. షబానా అజ్మీ ప్రమాద ఘటనపై బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు షాక్ కి గురయ్యారు. పలువురు.. జావేద్ అక్తర్ కు ఫోన్ చేశారు. షబానా అజ్మీ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆమె కోలుకోవాలని ఆకాంక్షించారు.

షబానా అజ్మీ కారు ప్రమాద ఘటన వివరాలను.. హైవే పోలీస్ పెట్రోల్ టీమ్ మీడియాకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రమాద ఘటనపై వివరాలు సేకరించడానికి దర్యాప్తు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపామని పోలీసులు తెలిపారు. కాగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ తప్పిదంతో ప్రమాదం జరిగిందా.? లేక లారీ డ్రైవర్ తప్పిదమే ప్రమాదానికి కారణమా అన్న వివరాలు దర్యాప్తు తరువాత తెలుపుతామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shabana azmi  car accident  injured  javed akhtar  mumbai-pune highway  MGM hospital  tragedy  tollywood  

Other Articles