TV Actor Sejal Sharma Commits Suicide In Mumbai హిందీ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్య

Dil toh happy hai ji actress sejal sharma found hanging left behind a suicide note

Sejal Sharma suicide, Hindi Tv Actress suicide, Dil Toh Happy Hain Ji, sejal sharma death, Sejal Sharma, sejal sharma suicide note, sejal sharma hanging, Hindi TV Shows, Simmi Khosla, Sejal Sharma, Rohit Sharma, Hardik Pandya, bhimsen joshi, Maharashtra, Bollywood, Crime

A television actor Sejal Sharma was found hanging in her flat at Mira Road. She left behind a suicide note. he Kashimira police has registered a case of accidental death. Two of her friends, including a room mate who were reportedly in the flat are being questioned.

‘‘దిల్ తొ హ్యాపీ హై జీ’’ సీరియల్ నటి సెజల్ శర్మ ఆత్మహత్య

Posted: 01/25/2020 05:20 PM IST
Dil toh happy hai ji actress sejal sharma found hanging left behind a suicide note

హిందీ టీవీ పరిశ్రమలో ఏం జరుగుతోందో కానీ వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ఈ పరిశ్రమకు చెందిన నటుడు కుషల్ పంజాబి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరగి ఇంకా నెల రోజులు కూడా తిరగక ముందే అదే పరిశ్రమకు చెందిన మరో నటి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. టీవీ నటిగా మంచి పేరు తెచ్చుకున్న యువ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడం ఆ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. సెజల్ శర్మ క్రితం రోజునే ఈ దారుణానికి ఒడిగట్టింది.

'దిల్ తో హ్యాపీ హై జీ' సీరియల్ లో సిమ్మీ ఖోస్లా పాత్రను పోషించిన ఆమె... ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఆ సీరియల్ లో ఆమె కోస్టార్ అయిన అరువర్మ మాట్లాడుతూ, సెజల్ మరణవార్తను విని షాక్ కు గురయ్యానని అన్నాడు. 10 రోజుల క్రితమే ఆమెను కలిశానని, ఆదివారం నాడు వాట్సాప్ లో చాట్ చేశానని చెప్పాడు. ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపాడు. ఆమె చాలా సంతోషంగా ఉండేదని.. ఇలా ఎందుకు చేసుకుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

సెజల్ ఆత్మహత్య చేసుకుందనే విషయం ఆమె కుటుంబానికి ఈ ఉదయమే తెలిసిందని... కానీ, నిన్న రాత్రే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అరువర్మ అన్నాడు. అంత్యక్రియల కోసం ఆమె భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు ఉదయ్ పూర్ కి తరలిస్తున్నారని చెప్పాడు. యాక్టింగ్ కెరీర్ కోసం 2017లో ఉదయ్ పూర్ నుంచి ముంబైకి సెజల్ వచ్చింది. స్టార్ ప్లస్ లో ప్రసారమవుతున్న 'దిల్ తో హ్యాపీ హై జీ' షోతో ఆమె నటన రంగంలోకి అడుగుపెట్టింది. పలు కమర్షియల్స్ లో కూడా కనిపించింది. 'ఆజాద్ పరిందే' వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles