mla komatireddy rajgopal reddy arrested at choutuppal చౌటుప్పల్ చైర్మెన్ ఎన్నిక ఉద్రిక్తం.. ఎమ్మెల్యేతో మాజీ బాహాబాహి

Clash between congress and cpm during choutuppal chairman election

Intense tension arose in Choutuppal Municipal chariman Election as the clash occured during Congress and CPM activists fight each other in the presence of MLA Rajagopal Reddy. Former MLA Kusukuntla Prabhakar supported CPM as to win the seat, who won 3 seats in alliance with congress.

Intense tension arose in Choutuppal Municipal chariman Election as the clash occured during Congress and CPM activists fight each other in the presence of MLA Rajagopal Reddy. Former MLA Kusukuntla Prabhakar supported CPM as to win the seat, who won 3 seats in alliance with congress.

చౌటుప్పల్ చైర్మెన్ ఎన్నిక ఉద్రిక్తం.. ఎమ్మెల్యేతో మాజీ బాహాబాహి

Posted: 01/27/2020 02:57 PM IST
Clash between congress and cpm during choutuppal chairman election

రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 50 శాతం సీట్లు రాలేదని.. అయినా ఆయా పురపాలక సంఘాలలో అధికారాన్ని అందుకునేందుకు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. తమకు పట్టున్న స్థానాల్లోనూ తమ మిత్రపక్షాల అభ్యర్థులను కలుపుకుని అధికారం అందుకునేందుకు అడ్డదారులు తొక్కుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అందుకు చౌటుప్పల్ మున్సిపాలిటీయే నిదర్శనమని పేర్కొంటోంది. తమతో కలసి ఎన్నికలలో పోటీ చేసిన సీపీఎం ముగ్గురు అభ్యర్థులను ఎలా కొనుగోలు చేసిందో చెప్పాలని ప్రశ్నిస్తోంది.

ఎమ్మెల్యేగా, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు. ఏ హోదాలో అక్కడికి మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అనుచరగణంతో వచ్చారని నిలదీసింది. అధికార పార్టీకి చెందిన నాయకుడు కాబట్టి అతని అక్రమంగా వచ్చినా.. అది న్యాయం అవుతుందా..? ఎక్స్ అఫిషియో సభ్యుడైన ఎమ్మెల్యేను అరెస్టు చేస్తారా.? అంటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తులు పోలీసులను నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు.

అసలేం జరిగిందీ.?

తెలంగాణలో మున్సిఫల్ పోరు ముగియడంతో ఇక చైర్మన్ల ఎంపిక ఘట్టానికి ఇవాళ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ రణరంగాన్ని తలపించింది. చైర్మన్ ఎంపిక తీవ్ర గందరగోళానికి దారి తీసింది. చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో హంగ్‌ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపాలిటీ కేంద్రం రణరంగంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీపీఎం కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే సీపీఎం అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ అక్కడికి చేరకున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ప్లేటు ఫిరాయించిన సీపీఎం.. సిద్దాంతాలు బేఖాతర్..

చౌటుప్పల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుండగా, వాటిలో అధికార టీఆర్‌ఎస్‌ 8, కాంగ్రెస్‌ 5, బీజేపీ 3, సీపీఎం 3, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్‌ బలం ఆరుకు చేరింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం టీఆర్‌ఎస్‌ కు మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీంతో సీపీఎం డౌన్‌ డౌన్‌ అంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిద్దాంతాలు మాట్లాడే సీపీఎం పార్టీ అమ్ముడుపోయిందంటూ కాంగ్రెస్ విమర్శిస్తూనే అడ్డుకుంది.

సీపీఎం చేసిన విశ్వాసఘాతుకానికి కొపోద్రిక్తుడైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ప్రమాణ పత్రాలను చించివేశారు. తమతో పోత్తుపెట్టుకుని ఎన్నికలలో గెలిచిన తరువాత టీఆర్ఎస్ తో ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసన తరువాత ఎవరు ఎవరితో కలస్తే మాత్రం తప్పేంటని టీఆరఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వాదనకు దిగడంతో ఇరువర్గాల మద్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో యుద్ధ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు రాజగోపాల్ రెడ్డిని బయటకు తీసుకురాగా, అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles