గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఊహించని విధంగా సర్ ప్రైజ్ గిఫ్ట్ ను పంపించింది. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ద్వారా సెంట్రల్ సెక్రటేరియట్‌లోని ప్రధాని కార్యాలయానికి ఈ గిఫ్టుకు పంపింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన వివరాలను కూడా కాంగ్రెస్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో పంపిన 170 రూపాయల విలువగల వస్తువును మరేదో కాదు... భారత రాజ్యాంగ పుస్తకం.
ఈ రాజ్యాంగ ప్రతిని మోడీకి పంపితూ కాంగ్రెస్ పార్టీ ప్రధానిపై పలు విమర్శలు చేసింది. ‘‘దేశాన్ని విభజించే ముందు రాజ్యాంగాన్ని ఓ సారి చదువుకోండి’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొంతకాలంగా ఆందోళనలకు కొనాసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో సహా వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎఆర్సీని కూడా వద్దంటున్నాయి.
‘‘మతం ఆధారంగా వ్యక్తులకు పౌరసత్వం కల్పించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని, ఈ కనీస పాఠాన్ని కూడా బీజేపీ నేర్చుకోలేకపోయిందని, కాబట్టే సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తోపాటు యావత్ దేశం ఆందోళనలను చేస్తొంద’’ని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ సమయంలో ప్రధాని మోడీకి రాజ్యాంగ ప్రతిని గిఫ్ట్‌గా పంపింది. అయితే ఈ పుస్తకాన్ని.. తాము అర్డర్ చేయలేదని ప్రధాని మంత్రి కార్యాలయం తిరస్కరించిందని సమాచారం.
గౌరవనీయులైన ప్రధాని గారు.. దేశాన్ని విభజించే పనిలో మీరు చాలా బిజీగా ఉన్నారని తెలుసు.. అయితే ఏకొంచెం టైమ్ దొరికినా ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.. ఇది మన భారత రాజ్యాంగం.. మన వ్యవస్థలన్నీ పనిచేసేది దీనిపైనే’ అంటూ కాంగ్రెస్ ట్విట్ చేసింది. ఫొటోలతోపాటు కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు రాజ్యాంగ పీఠిక చదువుతోన్న వీడియోలను కూడా పార్టీ ట్విటర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. మరి ప్రధాని కార్యాలయం ఈ గిఫ్ట్‌ను స్వీకరించిందా లేక తిప్పి పంపిందా అనేది తెలియాల్సి ఉంది.
Dear PM,
— Congress (@INCIndia) January 26, 2020
The Constitution is reaching you soon. When you get time off from dividing the country, please do read it.
Regards,
Congress. pic.twitter.com/zSh957wHSj
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more