ప్రమాదకరమైన కరోనా వైరస్ వందల మంది ప్రాణాలను ఇప్పటికే హరించేసిందని, ఇంకా వేల మంది దీని బారిన పడ్డారన్న వార్తల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఇది వైరస్ కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు వైద్యులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు సూచనలు చేస్తున్నారు. అల్లం అధికంగా తీసుకోవాలని, అల్లం, మిరియాల పోడి, తులసి ఆకులు, కొంచెం బెల్లం కలుపుకుని కాషాయంగా చేసుకుని రెండుపూటలా సేవిస్తే కరోనా వైరస్ సోకదని నాడి చికిత్స వైద్యులు ఇప్పటికే సమాచారం అందించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక హోమియోపతి వైద్యులు కూడా అల్లం కాషాయం మేలుచేస్తుందని సూచిస్తున్నారు.
అయితే కరోనా వైరస్ శరవేగంగా సోకడంతో పాటు ఈ వ్యాధిగ్రస్తులు అకస్మాత్తుగా తూలుతూ కిందపడి ప్రాణాలను విడచిపెట్టడం కూడా ప్రజల్లో అందోళన రెకెత్తిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. కాగా గత రెండు రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధికి సంబంధించిన మరో వార్త కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తును మన కళ్లముందు పరిచిన పరంజ్యోతి, మహాగురువులు, మహర్షి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో చెప్పారన్న వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
పోతులూరి వీరబ్రహ్మంద్రేస్వామి తన కాలజ్ఞానంలో కరోనా వైరస్ గురించి చెప్పారన్నదే ఆ పోస్టు సారాంశం. అయితే బ్రహ్మంగారికి ముందే ఈ వ్యాధి గురించి తెలుసా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నా.. అంతకన్నా.. ఈ వ్యాధి విషయంలో అయేన చేప్పిన మరణాల సంఖ్య ఇప్పుడు కలవంపెడుతోంది. కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో 114వ పద్యంలో చెప్పారంటూ ఓ ఇమేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆ ఇమేజ్ లో ఏముందంటే...?
"ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను.. లక్షలాది మంది ప్రజలు సచ్చేరయ.. కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి.. కోడిలాగ తూగి సచ్చేరయా" అని చెప్పారు. ప్రస్తుత పరిణామాలకు, బ్రహ్మంగారు చెప్పినదానికి పోలిక ఉందనే చాలా మంది అంటున్నారు. భారతదేశానికి చైనా ఈశాన్య దిక్కునే ఉంది. కోరంకి అనే జబ్బు కరోనా వైరస్ పేర్లు రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. అందుకే బ్రహ్మంగారు చెప్పింది జరగబోతోందనే పెద్ద సంఖ్యలో నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే పెనుముప్పు తప్పదని నెట్ జనులు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more