ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేరళలోని వయనాడ్ జిల్లా కాల్పెట్టలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రధాని నరేంద్రమోడీపై పదునైన మాటలతో విరుచుకుపడ్డారు.
మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే, ప్రధాని మోదీ ఇద్దరూ ఒకే భావజాలాన్ని నమ్ముతారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్న రాహుల్.. ఎన్ఆర్సీ, సీఏఏ వాటి వల్ల కొత్తగా ఉద్యోగాలు రావన్నారు. భారతదేశ పౌరులు తాము భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మహాత్మా గాంధీ సత్యాన్వేషణ చేస్తున్నందు వల్లే ఆయన పట్ల ద్వేషంతో గాడ్సే కాల్చి చంపాడని రాహుల్ అన్నారు.
గాడ్సే తనకు తాను నమ్మలేదు.. కాబట్టే గాంధీని చంపేశాడు. గాడ్సే ఎవర్ని ప్రేమగా చూడేలేదు.. తన గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు.. మోడీ కూడా అంతే. ఈ విషయంలో మోడీ గాడ్సేతో సమానం. మోడీ తనకు తానే ప్రేమించుకుంటారు..తనకు ఇష్టమైన పనే చేస్తాడు. ప్రజల గురించి పట్టించుకోరు. అటువంటిదే పౌరసత్వ చట్ట సవరణ. అది భారతదేశంలో చాలామందికి ఇష్టంలేదు. కానీ మోడీ అదేమీ పట్టించుకోరు. దాని వల్ల ఎటువంటి పరిణామాలు వచ్చినా ఆయనకు అనవరం.తన ఇష్టానుసారంగా చేస్తారు. అందుకే మోడీ గాడ్సేలాంటి భావజాలం ఉన్నవారు.
భారతీయులందరూ తాము భారతీయులం అని నిరూపించుకోవాల్సిన రోజులు వచ్చాయి. తాను భారతీయుడిని అని నిర్ణయించేందుకు మోడీ ఎవరు? అని రాహుల్ ప్రశ్నించారు. భారతీయుడా? కాదా? అని నిర్ణయించేందుకు మోడీకి ఎవరు లైసెన్స్ ఇచ్చారు? ప్రతీ భారతీయుడు తాను భారతీయుడినని నిరూపించుకోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చారనీ ఇది మోడీ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
భారతీయుడినని నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉద్యోగాలు అడిగినప్పుడల్లా.. మోడీ యువత దృష్టిని మరలుస్తారని రాహుల్ విమర్శించారు. ఎన్నార్సీ, సీఏఏలతో యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ ఎంపీ మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తే వారిపై దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారనీ విమర్శించారు రాహుల్ గాంధీ. తాము భారతీయులమని నిరూపించుకోవాల్సిన అవసరం ఏ భారతీయులకు లేదని అన్నారు.
#WATCH Rahul Gandhi, Congress in Kalpetta, Kerala: Nathuram Godse shot Mahatma Gandhi because he did not believe in himself, he loved no one, he cared for nobody, he believed in nobody and that is the same with our Prime Minister, he only loves himself, only believes in himself. pic.twitter.com/itx4GKiVIM
— ANI (@ANI) January 30, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more