సామాన్యుల బడ్జెట్ ఇది అని పేర్కొన్న కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్
మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని గుర్తుచేసుకుని బడ్జెట్ ప్రసంగం చేసిన కేంద్ర మంత్రి
ప్రపంచంలోనే దేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ
ప్రజల ఆదాయాలను మెరుగుపర్చడమే బడ్జట్ లక్ష్యం
ప్రజల కొనుగోలు శక్తిని కూడా వృద్ది చేస్తాం
ఎకానమి సంఘటితపర్చేందుకు చర్యలు
సత్వర చర్యల కారణంగా అదుపులోనే ద్రవ్యోల్భణం
భారత్ లో ఆర్థిక వనరులు పుష్కలం
దేశంలోని రెండు కోట్ల 71 మంది పేదరికం నుంచి బయటకు
ప్రధానమంత్రి అవాస్ యోజన ద్వారా అందరికీ ఇళ్లు కేటాయిస్తాం
అయితే రూపాయిలో 15శాతాం మాత్రమే లబ్దిదారులకు వెళ్తున్నాయి
ఈ వార్షిక సంవత్సరం ప్రారంభం నుంచి నూతన జీఎస్టీ అమలు
జీఎస్టీ అమలుతో సగటు భారతీయ కుటుంబం సగటున 4శాతం వరకు ఆదా
ఎన్డీయే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇవే
తొలి ప్రాధాన్యం : వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
ద్వితీయ ప్రాధాన్యాంశం : ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
మూడో ప్రాధాన్యాంశం : విద్య, చిన్నారుల సంక్షేమం
రంగాలవారీగా కేటాయింపులివే..
జల్ జీవన్ మిషన్‌కు రూ 11,500 కోట్లు
విద్యారంగానికి రూ 99.300 కోట్లు
నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
కొత్తగా ఐదు స్మార్ట్ సిటీల అభివృద్ధి
నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ ఏర్పాటుకు రూ1480 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
రవాణా మౌలిక సదుపాయాలకు రూ 1.7 లక్షల కోట్లు
సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ 9500 కోట్లు
టూరిజం ప్రోత్సాహానికి రూ 2500 కోట్లు
సాంస్కృతిక శాఖకు రూ 3150 కోట్లు
బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట
రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు
ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు
స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ 12,300 కోట్లు
పైప్డ్ వాటర్ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు
వ్యవసాయ రంగం-రైతుల ఆదాయం రెట్టింపు
రానున్న వార్షికానికి రూ.2.83లక్ష్లల కోట్ల కేటాయింపు
16 లక్షలమంది రైతులకు గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బడ్జెట్ లక్ష్యం
రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
వ్యవసాయంలో పోటీతత్వం, సాంకేతికత్వం రావాలి
26 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు
పేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చాం
బీడు పొలాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం
రైతుల వ్యవసాయ ఉత్పత్తులు రవాణాకు కృషి ఉడాన్ పథకం
పిపిపి పద్దతిలో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో రైళ్లు
వర్షాభావ జిల్లాలకు అదనపు నిధులు
మత్స్య ఉత్పత్తిని 2022 నాటికి 200 లక్షల టన్నులకు పెంపు
ప్రధానమంత్రి ఫసల్ భఈమా యోజనలోకి మరో 6.11 కోట్ల మంది రైతులు
స్వచ్ఛాభారత్ పథకానికి 12,300 కోట్ల నిధులు
విద్యారంగానికి రూ.99000 కో్ట్ల కేటాయింపు
త్వరలో నూతన విద్యావిధానం తీసుకోస్తాం
నగర మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలలో నూతన ఇంజనీర్లకు ఇంటర్న్ షిప్..
ప్రధానమంత్రి ప్రకటించిన జల్ జీవన్ మిషన్ కు రూ.3.6 లక్షల కోట్లు
ఈ నిధులతో లక్షలాధి మందికి సురక్షిత తాగునీరు
ఇకపై ఇండ్ శాట్ పథకం ద్వారా భారత్ లో విద్యాభాసం
ఆన్ లైన్ లో డిగ్రీ విద్యాబోధన కోసం టాప్ వంద కాలేజీలకు అనుమతి
జాతీయ పోలీసింగ్ యూనివర్శిటీ ఏర్పాటు
జాతీయ ఫోరెన్సిక్ యూనివర్శటీ ఏర్పాటు
ఉపాధ్యాయులు, నర్సులు, పారామెడికల్ స్టాప్ కు ప్రత్యేక బ్రిడ్జి కోర్సులు
ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ దారి నిర్మాణ 2023 నాటికి పూర్తి
సెల్ ఫోన్, సెమీకండర్టర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి పథకం..
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వంద విమానాశ్రాయాల అభివృద్ది
తేజస్ తరహా ప్రైవేటు రైళ్ల సంఖ్య పెంపు..
తేజస్ రైళ్లతో పర్యాటక ప్రాంతాల పర్యటన
చెన్నై-బెంగళూరు ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం చేపడతాం
ఆడపిల్లల వివాహ వయస్సు పెంపు విషయమై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
పాఠశాల స్థాయి ఉన్నత విద్య వరకు బాలికలు ముందంజలో ఉన్నారు
బేటీ బచావో బేటీ పఢావో గొప్ప విజయం సాధించింది
ప్రాథమిక స్థాయి విద్యలో బాలుర కంటే బాలికలే ఐదు శాతం ఎక్కువ ఉన్నారు
ఆరు లక్షలమంది అంగన్వాడీలకు సెల్ఫోన్లు
పౌష్టికాహారం, హెల్త్‌కేర్‌పై ప్రత్యేక దృష్టి
మహిళా సంక్షేమ పథకాల రూ. 28,600 కోట్లు
పౌష్టికాహార పథకానికి రూ. 35.6 కోట్లు
పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
ఎఫ్‌డీఐలు 284 బిలియన్ డాలర్లకు చేరాయి
విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి
విద్య, స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి
2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం కొత్త కోర్సులు
ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్ కాలేజీ
కొత్తగా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ సెల్..
యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం
గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి
ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ఏర్పాటు
ల్యాండ్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్
మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం
ఎలక్ట్రానిక్, మాన్యుఫాక్చరింగ్పై ప్రత్యేక దృష్టి
మొబైల్ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం
సేంద్రియ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సహకాలు
జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్‌కు చేయూత
ఆన్లైన్లో ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయం
ఇక నుంచి ఇన్‌కం టాక్స్ రిటర్న్‌ల ఫైలింగ్ మరింత సులభతరం చేస్తాం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తనదైన శైలిలో బడ్జెట్ ప్రసంగంలో దూసుకుపోతున్నారు. వరుసగా రెండోసారి పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆమె ఐదు లక్షలు ఆపై వార్షికాదాయ ఆర్జిస్తున్న ఉధ్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న కనిష్ట పన్ను స్లాబ్ లో ఎలాంటి మార్పు లేకున్నా.. ఆపై నున్న తరగతి స్లాబుల్లో మాత్రం శుభవార్తను అందించింది. ఇక దీంతో రూ.15 లక్షల వార్షికాదాయం వున్న ఉద్యోగులకు కూడా ఏడాదికి రూ.78 వేలు పన్ను మినహాయింపు లభిస్తుందని అన్నారు.
రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 5శాతం
రూ.5 లక్షల నుంచి 7,5 లక్షల వరకు 10 శాతం 20శాతం
రూ.7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 15శాతం 20శాతం
రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20శాతం 30 శాతం
రూ.12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం 30 శాతం
రూ.15 లక్షలు ఆఫై వార్షికాదాయం వుంటే 30 శాతం
ఇక దీనితో పాటు హౌజింగ్ రుణాలు పొందే ఉద్యోగులకు లక్షన్నర పన్ను మినహాయింపును మరో ఏడాది పాటు పొడగింపు
డిపాజిట్ భీమా పరిధి రూ లక్ష నుంచి రూ 5 లక్షలకు పెంపు
పన్ను అధికారుల వేధింపులను సహించం
కొన్ని నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ తప్పించేలా కంపెనీ చట్టం సవరణ
సహకార బ్యాంకుల పరిపుష్టి
గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్
షేర్ల అమ్మకం ద్వారా ఎల్ఐసీలోప్రభుత్వ వాటా పాక్షిక విక్రయం
ఐడీబీఐ బ్యాంకులోని ప్రభుత్వ వాటా అమ్మకం
2021లో జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుందని ఆశాభావం
వచ్చే సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 10శాతం వరకు పెరుగుతుందని ఆశాభావం
కార్పొరేట్ పన్నుల తగ్గింపు విప్లవాత్మక నిర్ణయం
ప్రపంచంలో అతితక్కువ కార్పొరేట్ పన్నులు ఉన్న దేశం భారత్
కొత్తగా అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు
కార్పొరేట్ ట్యాక్స్ 15శాతం తగ్గింపు
కార్పొరేట్ ట్యాక్స్‌లు తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయం
డివిడెండ్ డిస్ర్టిబ్యూషన్ ట్యాక్స్ రద్దు
బ్యాంకింగ్ రంగంలో మరింత పారదర్శకత రావాల్సిన అవసరముంది
చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాల పునరుద్ధరణ గడువు 2021 వరకు పెంపు
ఫైనాన్షియల్ కాంట్రాక్ట్‌ల ప్రత్యేక చట్టం
మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు
రవాణారంగ అభివృద్ధికి బడ్జెట్లో కొత్త వ్యూహాలు
ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి
రాంచీలో ట్రైబల్ మ్యూజియం
అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్ మ్యూజియం
పర్యాటక అభివృద్ధికి తేజాస్ రైళ్లు
రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ.. పీపీపీ పద్ధతిలో 150 రైళ్లు
ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు
పెద్దసంఖ్యలో తేజాస్ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లు
చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం
త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ
ఇక నుంచి యంత్రాలతో సెప్టిక్ ట్యాంకుల క్లినింగ్
ప్రైవేటు రంగంలో డేటా సెంటర్ పార్క్‌లు ఏర్పాటు
కరెంటు బిల్లుల స్థానంలో త్వరలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more