National awardee director arrested in Hyderabad పోలీసుల అదుపులో టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత

Film director producer booked in hyderabad for promoting obscenity

SR Nagar police, SanjeevReddy Nagar Police, case against director, case against national award director, case against producer, case against Telugu movie, case against ‘Degree College', case against obscenity, Ameerpet junction, director Narsimha Nandi, producer Srinivas Rao, S Murali Krishna, Hyderabad Police, Telangana, Crime

The SR Nagar police booked a case against director and producer of the Telugu movie ‘Degree College’ on charges of promoting obscenity. The case was registered after a few persons complained about a few posters promoting the movie came up near the busy Ameerpet junction.

పోలీసుల అదుపులో టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత

Posted: 02/06/2020 12:14 PM IST
Film director producer booked in hyderabad for promoting obscenity

జాతీయస్థాయిలో ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్న టాలీవుడ్ దర్శకుడు నర్సింహనంది, నిర్మాత శ్రీనివాసరావును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు రూపొందిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి పిర్యాదులు రావడంతో స్పందించిన పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. గతంలో '1940లో ఒక గ్రామం' చిత్రం ద్వారా జాతీయస్థాయిలో ఉత్తమ దర్శకుడి అవార్డును నర్సింహనంది అందుకున్న విషయం తెలిసిందే.

అయితే శ్రీలక్ష్మీనరసింహ సినిమా బ్యానర్ పై తాజాగా దర్శకుడు నర్సింహనంది రూపోందిస్తున్న ‘డిగ్రీ కాలేజ్’ అనే సినిమాకు సంబంధించిన వీరిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బూతు కంటెంట్ తో సినిమాల పోస్టర్లను బహిరంగంగా అతికించడమే వీరు చేసిన నేరం. ఇలాంటి పోస్టర్లను విడుదల చేసిన వారిపై కఠినచర్యలకు ఉప్రక్రమించిన పోలీసులు దర్శకనిర్మాతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ చిత్రంలో వరుణ్, శ్రీదివ్య, దువ్వాసి మోహన్, జయవాణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా అమీర్ పేట్ ప్రధాన కూడలిలో అశ్లీలంగా, అసభ్యకరంగా ఉన్న పోస్టర్లను అతికించారని ఆ మార్గంలో వెళ్లే పలువురు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్శక, నిర్మాతలు నర్సింహనంది, శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకున్నారు. తరువాత వీరిని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించగా, వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే వీరి అరెస్టుతో చిత్రానికి బొలెడంత పబ్లిసిటీ వచ్చేసిందని సినీజనాలు గుసగుసలాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles