ఐటీ శాఖను కేంద్రం తమ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపుకు వినియోగిస్తుందన్న అరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. గత కొన్ని రోజులుగా కేవలం సినీపరిశ్రమ వర్గానికి చెందిన ప్రముఖుల వరకే పరిమితమైయ్యాయి. కాగా రాష్ట్రంలోని రాజకీయ నేతలపై ఐటీ అధికారుల దృష్టి మళ్లింది. తాజాగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నివాసంలోఇవాళ తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. 10 మంది ఐటీ అధికారులు బృందం ఆయన నివాసంలో తనిఖీలు చేశారు.
ఇక కడప జిల్లా ద్వారకానగర్ లోని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో తెల్లవారు జామునుంచి జరుగుతున్న సోదాలలో భాగంగా ఐటీ అధికారుల బృందం పలు దస్త్రాలను పరిశీలించింది. ఆయన వ్యాపారానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేసింది. సకాలంలో ఆదాయపుపన్ను చెల్లిస్తున్నారా? అనే వివరాలను అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఇంటి తలుపులు మూసివేశారు. ఇక ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా.. ఐటీ అధికారుల బృందం తనిఖీలకు అడ్డుపడకుండా ఇంటి బయట పోలీసులు మోహరించారు.
రాజకీయ నేత ప్రవృత్తిగా పెట్టుకున్నా.. ఆయన మాత్రం ప్రముఖ కాంట్రాక్టరన్న విషయం తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం మేరకు సోదాలు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంట్లోని పలు రికార్డులు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు పరిశీలించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంతో పాటు పంజాగుట్టలో శ్రీనివాసుల రెడ్డికి చెందిన ఆర్.కె.ఇన్ఫ్రా కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more