Flower vendor finds Rs 30 cr in his account పూలవ్యాపారి ఖాతాలోకి రూ.30 కోట్లు.. పోలీసుల కేసు..

Flower vendor gets rs 30 crore credit in wife s bank account

accidentally payment deposited in bank account,30 crore rupees deposited in flower seller account, Saeed Malik Burhan, flower seller, medical needs, Rehana account, Channapatna town, Ramangara district, IT Department, Karnataka, Crime

A flower seller of Channapatna town in Ramangara district of Karnataka was surprised when he came to know that Rs 30 crore got credited in his wife's bank account.

పూలవ్యాపారి ఖాతాలోకి రూ.30 కోట్లు.. పోలీసుల కేసు..

Posted: 02/07/2020 12:20 PM IST
Flower vendor gets rs 30 crore credit in wife s bank account

నిత్యం కష్టంపైనే ఆదారపడే జీవికి అదృష్టం అగంతకుల రూపంలో కలిసోచ్చినా.. బ్యాంకు అధికారుల దానిని అడ్డుకున్నారు. నిత్యం వందలు, వేల రూపాయలు మాత్రమే ఉండే బ్యాంకు అకౌంట్లో ఒక్కసారిగా ఊహించని స్థాయిలో డబ్బు జమ అయితే.. ఉరుకులు పరుగులు తీసుకుంటూ వారు బ్యాంకు ఖాతాదారు ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. వచ్చీ రాగానే వారు తమదైన శైలిలో వారిని విచారించారు. పేదలంటే పెద్దలకు, అధికారులకే కాదు సాటి పేదలకు కూడా చులకనేనన్న విషయం తెలిసిందే కదా.. అలా వారిని ప్రశ్నలతో ఉక్కరిబిక్కిరి చేశారు.

రోడ్డు పక్కన పూల వ్యాపారం చేస్తూ.. జీవినాన్ని సాగించే ఓ కుటుంబానికి ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజర పథకం కింద బ్యాంకు ఖాతా తెరిచి.. వానిని వినియోగిస్తున్నారు. ఎప్పుడైన ఫూల అర్డర్ బాగుంటే వచ్చిన లాభంలోని కొంత డబ్బును అందులో దాచి వారి భవిష్యత్ అవసరాలను తీర్చుకునేందుకు వినియోగిస్తున్నారు. కాగా ఈ ఖాతాలోకి ఓ రోజు ఏకంగా రూ.30 కోట్ల వచ్చి పడ్డాయి. కానీ ఈ విషయాన్ని ఓ అగంతకుడు తమకు ఫోన్ చేసి చెప్పే వరకు వారికి తెలియదు. తెలిసిన తరువాత బ్యాంకు ఏటీయంలోకి వెళ్లి ప్రయత్నించగా డబ్బులు రాలేదు. బ్యాంకు ఖాతాను అప్పటికే అధికారులు బ్లాక్ చేశారు.

కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలోని చెన్నపట్టణం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పట్టణంలో పూలను విక్రయించి జీవనం సాగిస్తున్న సయ్యద్ మాలిక్ బుర్హాన్ అతడి భార్య రెహనా భాను జన్ ధన్ భ్యాంకు ఖాతాను 2015లో ఎస్బీఐ బ్యాంకులో తెరిచారు. అయితే అడపాదడపా వందలు, వేల రూపాయలను మాత్రమే డిఫాజిట్ చేసి విత్ డ్రా కూడా చేసుకునేవారు. అయితే గత కొంతకాలంగా అందులో కేవలం రూ.60 మాత్రమే ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబర్ 2న ఆ బ్యాంకు అకౌంట్లో అకస్మాత్తుగా రూ.30 కోట్ల జమయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ నుంచి ఓ అగంతకుడు ఫోన్ చేసి చెబితేనా వారికి తెలిసింది.

దీంతో ఒక్కసారిగా షాక్ అయిన బ్యాంకు అధికారులు ఇంత మొత్తం ఎలా జమైందో తెలుసుకునేందుకు రెహానా భాను ఇళ్లు వెతుక్కుంటూ వచ్చారు. వచ్చీ రాగానే వారిపై ప్రశ్నలను సంధించారు. మీ ఖాతాలోకి రూ.30 వేలను ఎవరు జమచేశారో చెప్పాలని ప్రశ్నించగా వారు నోరెళ్లబెట్టారు. తమ బ్యాంక్ అకౌంట్లో అంత నగదు ఎలా జమ అయిందో తమకు తెలియదని బుర్హాన్‌, రెహానా దంపతులు అధికారులకు చెప్పారు. అయినా.. అధికారులు వినకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. మీ బ్యాంకు ఖాతా వివరాలు ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.

దీనికి బుర్హాన్ బదులిస్తూ.. ఇటీవలే తాను ఆన్ లైన్ లో ఓ చీర కొనుగోలు చేసేందుకు ఆర్డర్‌ ఇచ్చానని చెప్పాడు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి తన మొబైల్‌కు కాల్ చేసి.. ఎస్‌యూవీ లాటరీలో రూ.14 లక్షలు తగిలాయని చెప్పినట్లు తెలిపాడు. కారు ఇన్సూరెన్స్ కోసం రూ. 6 వేలు పంపాలని ఆ వ్యక్తి కోరినట్లు అతడు చెప్పాడు. అంత సొమ్ము తన వద్ద లేదని.. చెప్పి నిరాకరించినట్లు వివరించాడు. తన చెవి ఆపరేషన్‌ కోసమే రూ. 2 లక్షలు కావాలని చెప్పి అతడిని సాయం కోరినట్లు తెలిపాడు. దీంతో సదరు వ్యక్తి.. తమ బ్యాంక్ ఖాతా వివరాలు అడిగితే ఇచ్చినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత అతడి ఫోన్‌ కలవలేదని బుర్హాన్‌ తెలిపాడు.

జనవరి నెలలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు బుర్హాన్ తెలిపాడు. ‘మీ ఖాతాలో ఉన్న రూ.30 కోట్లలో.. నాకు రూ.15 కోట్లు జమ చేయండి. మిగతా రూ.15 కోట్లు మీ వద్దే ఉంచుకోండి’ అని ఆ వ్యక్తి చెప్పినట్లు వెల్లడించాడు. కానీ, అధికారులు అప్పటికే రెహానా బ్యాంకు ఖాతాను, ఏటీఎం కార్డును క్లోజ్‌ చేశారు. ఈ ఘటనపై చెన్నపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రెహానా ఖాతాలో రూ.30 కోట్లు జమ చేసిన వ్యక్తి ఎవరనే విషయాన్ని చేధించే పనిలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles