Mumbai serial molester Raijur Habibur Khan arrest సీరియల్ లైంగికదాడి అగంతకుడిఅరెస్ట్.. వల పన్ని..

Mumbai serial molester caught on camera stalking kissing groping women on railway bridge

mumbai, matunga, matunga railway bridge, matunga railway foot-over bridge, serial molester, molester mumbai, molester mumbai bridge, mumbai man molest women railway bridge, molestation, Raijur Habibur Khan, carpenter, mumbai police, Railway station, matunga railway bridge, cctv footage, mumbai, maharashtra, crime

A serial molester was arrested by police in Mumbai who stalked women on a railway bridge in Matunga and then groped and kissed them. The police laid a trap to nab the accused hailing from Uttar Pradesh.

ITEMVIDEOS: సీరియల్ లైంగికదాడి అగంతకుడిఅరెస్ట్.. వల పన్ని..

Posted: 02/07/2020 04:15 PM IST
Mumbai serial molester caught on camera stalking kissing groping women on railway bridge

నిర్జన ప్రాంతంలో ఒంటరి మహిళలు కనిపిస్తే మగాడిలో మృగాడు బయటకొస్తూ అఘాయిత్యాలకు తెగబడుతున్నాడు. నిర్భయ ఘటనలో దోషులకు మరణశిక్ష పడినా.. దిశ ఘటనలోని దుండగులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినా.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఉన్నఊరిలో బతకజాలక.. అక్కడ చేతినిండా పనిలేక బతుకుదెరువు కోసం దేశ ఆర్థిక రాజధానికి వలసోచ్చిన ఓ వ్యక్తి.. నిజాయితీగా పని చూసుకోవడం మానేసి.. దోంగతనాలు, మహిళలపై లైంగిక వేధింపులకు తెగబడుతున్నాడు.

మతుంగా రైల్వేస్టేషన్ లో తాము ఎదుర్కోంటున్న లైంగికదాడిపై పలువురు రైల్వే సిబ్బందికి పిర్యాదు చేశారు. ఇంకోందరు మౌనంగా ఉండిపోయారు. మరికొందరు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అయితే ఎవరూ పోలీసులకు మాత్రం సమాచారం అందించలేదు. గత నెల 26న గణతంత్ర దినోత్సవం రోజున ఓ యువతి తాను ఎదుర్కోన్న లైంగికదాడిపై పోలీసులకు మౌఖిక ఫిర్యాదు చేసింది. కానీ లిఖితపూర్వకంగా అధికారికంగా అతడిపై పిర్యాదు ఇవ్వలేదు. అయినా పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో నిందితుడ్ని వల పన్ని పట్టుకున్నారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన రాయ్‌జుర్‌ హబిబూర్ ఖాన్ వృత్తిరిత్యా వడ్రంగి. తన కుటుంబ పోషణకు తగినంత పని అక్కడ లభించకపోవడంతో.. భార్య, ఇద్దరు పిల్లలతో కలసి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి వలసవచ్చాడు. అయితే అక్కడ కుటుంబ పోషణ కోసం పని కోసం ఆలోచించడం మానేసి.. ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై మాటువేసి.. ఒంటరిగా వచ్చే యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారు కనిపించగానే వెనకనుంచి వెళ్లి గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. వారు ప్రతిఘటిస్తే పరారయ్యేవాడు. గత కొన్ని నెలలుగా ఇదే పని.

కాగా, పోలీసులు బాధుతులు ఎవరైనా వుంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరినా ఎవరూ ముందుకు రాకపోవడంతో.. రాయ్‌జుర్ ను అదుపులోకి తీసుకుని అతడిపై దొంగతనం కేసు నమోదు చేశారు. ముంబైకి వచ్చిన తొలినాళ్లలో రాయ్‌జుర్ ఒక దొంగతనం కేసులో నిందితుడు. దీంతో పాత నేరస్థుడైన రాయ్‌జుర్ ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. కాగా, న్యాయస్థానంలో దొంగతనం కేసుతో పాటు సిసిటీవీ ఫూటేజీలను సాంకేతిక ఆధారాలుగా చూపించి న్యాయపరంగా లైంగికదాడి కేసులను కూడా నమోదు చేసేందుకు వున్న అవకాశాలను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు.

***WARNING: THE VIDEO CAN BE DISTURBING FOR SOME VIEWERS, DISCRETATION IS ADVISED***

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles