Naveen Patnaik is richest among Odisha Ministers ఒడిశా యువమంత్రి ఆస్తి విలువ మరీ అంత..

With rs 64 26 crore assets naveen patnaik is richest minister in odisha

Naveen Patnaik, government's website, Chief Minister, Odisha ministers, Odisha CM Naveen Patnaik, Naveen Patnaik richest minister, Odisha government, Naveen Patnaik latest news, Odisha ministers Property list, Odisha ministers assets, Odisha

Odisha Chief Minister Naveen Patnaik is the richest among the ministers in the state with assets worth over Rs 64.26 crore, the state government said on its website. The Odisha government has released the property list of 20 ministers, including that of Mr Patnaik

ఒడిశా ముఖ్యమంత్రి ఆస్తి విలువ ఎంతో తెలుసా.?

Posted: 02/13/2020 12:31 PM IST
With rs 64 26 crore assets naveen patnaik is richest minister in odisha

ఒడిశా మంత్రివర్గంలోని మంత్రులంతా తాజాగా తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. మంత్రులందు ముఖ్యమంత్రి వేరయా అన్నట్లు.. దేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడ కనిపించని ఆరుదైన ఘటనకు ఒడిశా కేంద్రబిందువుగా నిలుస్తోంది. అదేంటి అంటారా.. ఇక్కడ మంత్రివర్గంలోని అందరు మంత్రుల కన్నా ముఖ్యమంత్రి ఆస్తులే ఎక్కువగా వున్నాయి. ఇదే విషయం తాజాగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించిన ఆస్తుల వివరాలలోనూ నిరూపితమైంది. గతేడాది (2019) మార్చి 31 నాటికి తన ఆస్తి రూ.64.26 కోట్లు అని ప్రకటించారు.

ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రులందరూ తమ తాజా ఆస్తుల వివరాలను వెల్లడించగా.. వారి ఆస్తుల వివరాలను ప్రభుత్వం.. తమ అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చింది. దానిని బట్టి సీఎం నవీన్ పట్నాయక్ మొత్తం ఆస్తిలో రూ. 62 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి రూ. 63 కోట్ల విలువైన ఆస్తులు సంక్రమించినట్టు తెలిపారు. ఇక, ఒడిశా మంత్రుల్లో యువమంత్రిగా కొనసాగుతున్న క్రీడలు, ఐటీశాఖ మంత్రి తుష్కర్ కాంతి బెహరా ఆస్తి ఎంతో తెలుసా.? రూ. 25 లక్షలు. నమ్మకశ్యంగా లేదా.. కానీ ఇదే నిజం.

తన ఆస్తితో ఆయనే రాష్ట్ర క్యాబినెట్ మంత్రులలో కనిష్ట స్థానంలో నిలిచారంటే అతిశయోక్తి కాదు. ఆస్తులు సంపాదించుకోవడం కంటే ఆశయాలను సిద్దించుకోవడం గొప్ప అన్న సిద్దాంతాన్ని ఫాలో అవుతున్నారు బెహరా. ఈయన పేరున కేవలం రూ.8 లక్షల ఆస్తి మాత్రమే ఉంది. అది కూడా ఇంటి స్థలం మాత్రమే. ఇది కాకుండా ఓ ఫియట్ పుంటో కారు కూడా ఆయన సమకూర్చుకున్నారు. ఇక జీవితభీమా కింద రూ.ఐదు లక్షలు.. ఇవి కాకుండా రెండు లక్షల రూపాయల మేర పెట్టుబడుతు. ఇవే బెహరా అస్తులలో చెప్పుకోదగ్గవి. అంతే ఇక మిగిలిన ఆస్తులన్నీ నామమాత్రమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naveen Patnaik  government's website  Chief Minister  Property list  assets  Odisha ministers  Odisha  

Other Articles