మార్చి నెలలో బ్యాంకులకు దేశవ్యాప్తంగా ఏకంగా 19 రోజులు సెలవులు రానున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 రోజులు పాటు దేశవ్యాప్తంగా బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. 31 రోజుల నెలలో 19 రోజుల పాటు సెలవులు అన్ని ప్రాంతాల్లో వర్తించవు. కాగా, ఆరు రోజుల పాటు వరుస సెలవులు మాత్రం దేశవ్యాప్తంగా బ్యాంకులన్నింటికీ వర్తించనుంది. దీంతో ఖాతాదారులు అందుకు అనుగుణంగా ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని బ్యాంక్ ఉద్యోగులు కోరుతున్నారు.
సాధారణ సెలవులు, పండగ సెలవులు వెరసి 16 రోజులు బ్యాంకులలో కార్యక్రమాలు నిలిచిపోనుండగా, ఇదే మాసంలో మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో కలిపి మొత్తం 19 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. లావాదేవీల కోసం తరచూ బ్యాంకులకు వెళ్లేవారికి మార్చిలో కష్టాలు తప్పవు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. దీంతో బ్యాంకుల్లో ఏవైనా వ్యవహరాలుంటే ముందు జాగ్రత్తతో వ్యవహరించాల్సిందే. ఇక సెలవులు ఎప్పుడెప్పుడు అన్న విషయంలోకి ఎంట్రీ ఇస్తే..
మార్చి 1- ఆదివారం, మార్చి 5- పంచాయతీ రాజ్ దినోత్సవం(ఒడిశా), మార్చి 6- చాప్చర్‌కుట్ పండగ(మిజోరాం), మార్చి 8- ఆదివారం, మార్చి 9- హజరత్ అలీ పండగ(ఉత్తరప్రదేశ్), మార్చి 10- డోల్ పూర్ణిమ(ఒడిశా, వెస్ట్ బెంగాల్, త్రిపురా), హోళీ, మార్చి 11 నుంచి 13- బ్యాంకుల సమ్మె, మార్చి 14- రెండో శనివారం, మార్చి 15- ఆదివారం, మార్చి 22- సండే, మార్చి 23- షాహిద్ భగత్ సింగ్ డే(హర్యానా), మార్చి 25- ఉగాది(కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, జమ్మూ కశ్మీర్), మార్చి 26- చేటిచంద్ యానివర్సరీ( గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్), మార్చి 27- సర్హుల్ పండగ( ఝార్ఖండ్), మార్చి 28- నాలుగో శనివారం, మార్చి 29- ఆదివారం.. ఇలా దేశవ్యాప్తంగా మార్చి నెలలో బ్యాంకులకు 19 రోజులు సెలవులు వచ్చాయి
ఆరు రోజుల పాటు వరుస సెలవులు ఎప్పుడా అన్ని సందేహం వచ్చిందా.? ఇక అందులోనూ ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్తించనున్నందున్న బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా వుండాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకి ఆ తేదీలు ఎఫ్పుడంటే.. మార్చి నెల రెండో వారంలో ఈ వరుస సెలవులు రానున్నాయి. ఈ వారంలో కేవలం సోమవారం మాత్రమే బ్యాంకుల్లో కార్యకలాపాలు జరగనున్నాయి. ఇక మంగళవారం హోళి పండగ. దీంతో బ్యాంకులకు సెలవు. ఆ తరువాత 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు సమ్మె, దీంతో బంద్ పాటిస్తున్నారు ఉధ్యోగులు, ఆ తరువాత 14న రెండు శనివారం, ఆ తరువాత రోజు 15న ఆదివారం సాధారణ సెలవు రోజు దీంతో వారంతో ఆరు రోజులు సెలవులే. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో అయితే మార్చి 9 కూడా హజరత్ అలి పండగ కాబట్టి వారికి వరుసగా 8 రోజులు సెలవులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more