సికింద్రాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన రోగి వచ్చాడన్న వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, అది నిజమేనని అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపుల చైర్ పర్సెన్ ఉపాసన కొణిదెల వెల్లడించారు. సికింద్రాబాద్ లోని అపోలో అసుపత్రి కేసును గుర్తించామని అమె తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీంతో హైదరబాద్‌లో తొలి కోవిడ్ కేసు నమోదైందని ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ప్రస్తుతం సదరు రోగిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దుబాయ్ నుంచి బెంగళూరు ద్వారా నగరానికి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్, వీడియోను పెట్టిన ఆమె, కరోనా వైరస్ పై అపోలోనే స్క్రీనింగ్ ప్రొటోకాల్స్ ను అత్యంత కచ్ఛితత్వంతో పాటిస్తున్నామని అన్నారు. మిగతా రోగులకు అతన్ని దూరంగా ఉంచి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా ఉండి, ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలని కోరారు.
ఉపాసన చెప్పిన జాగ్రత్తలు
* జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి.. కరోనా వ్యాధి లక్షణాలు.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
* ఈ వైరస్ కు ఇప్పటి వరకూ ఎలాంటి ఔషధం లేదు.
* హోమియోపతిలో ఔషధం ఉందని అంటున్నా.. ఇప్పటికీ ధృవీకరించబడలేదు
* చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోంది. మాస్కులు తప్పని సరిగా వాడండి
* జంతువుల ద్వారా ఈ వైరస్ సోకుతుందని అంటున్నారు. ఇదీ నిర్ధారణ కాలేదు.
* మంసాహారం తినడం వల్ల కరోనా వైరస్ సోకదు. మంసాన్ని బాగా ఉడికించి తినండి
* మీ పిల్లలకు కానీ, పెద్ద వారికి కానీ దగ్గు, జ్వరం ఉంటే బయటకు వెళ్లనీయకండి.
* ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండీ..
Secunderabad @HospitalsApollo detected a case of #coronavirus due to strict screening protocols.
— Upasana Konidela (@upasanakonidela) March 3, 2020
patient currently at Gandhi Hosp.
staff that cared for him are in quarantine.
Highest standards of infection control r being adopted .
Be responsible citizens & report symptoms. pic.twitter.com/OfVnWZd88S
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more