భారత ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఆయన కూడా ఒకరు. అయితే ఈ ఆదివారం నుంచి తాను సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండాలని భావించినట్టు మోదీ వెల్లడించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను.. అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్లను కలిగివున్న ప్రధాని.. తన అకౌంట్ల నుంచి తప్పుకోవాలని భావించడం అభిమానులకు రుచించలేదు.
ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన ట్వీట్ చేసిన గంట వ్యవధిలోనే 26 వేలసార్లకు పైగా రీ ట్వీట్ అయింది. క్షణానికో కామెంట్ వచ్చింది. మోదీ నుంచి నిరంతర అప్ డేట్స్ కొనసాగాలని, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అత్యధికులు కోరడం గమనార్హం. ఈ నేపథ్యంలో 'నో సార్' అని కొన్ని వేల కామెంట్లు వచ్చాయి. "కావాలంటే చిన్న బ్రేక్ తీసుకోండిగానీ, పూర్తిగా వదిలేయవద్దు" అని కూడా కామెంట్లు వచ్చాయి. మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేసి, మోదీ వదిలేస్తే తామూ సోషల్ మీడియాను వదిలేస్తామని స్పష్టం చేశారు. ఇక 'నో సార్' హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది.
కాగా, సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ చాలా చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో 5.33 కోట్లమంది, ఫేస్ బుక్ లో 4.4 కోట్ల మంది, ఇన్ స్ట్రాగామ్ లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లను కలిగివున్న టాప్ - 3 నేత, ఫేస్ బుక్ లో టాప్-2 నేత ప్రధాని నరేంద్రమోదీ కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు టొనాల్డ్ ట్రంప్ సైతం భారత పర్యటన నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఎందుకు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం ప్రధాని వెలువరించలేదు.
ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో.. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తనదైనశైలిలో రాహుల్ గాంధీ మోడీకి చురకలంటించారు. వదిలేయాల్సింది సోషల్ మీడియాను కాదని, విద్వేషాన్ని వదిలేయాలని రాహుల్ హితవు పలికారు. అటు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. మన ప్రధాని అకౌంట్ ను ఎవరూ హ్యాక్ చేయలేదు కదా! అంటూ చమత్కరించారు. లేకపోతే, డిజిటల్ మాలిన్యాలను తొలగించే సున్నితమైన ప్రక్రియ గురించి ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more