చిన్నారులు ముద్దులొలికే మాటలు వింటే ఎంతటి కరుడుగట్టిన హృదయాలైనా ఇట్టే కరిగిపోతాయి. ఎంత కోసంలో వున్నవారైనా ఇట్టే మంచుకన్న చల్లగా మారిపోతారు. ఇధి నిజంగా నిజం. ఇక వారు ఏదైనా అడిగితే కాదని చెప్పలేం. అలాంటి ఘటనే ఒకటి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగింది. బస్సులో తన తల్లిదండ్రులతో కలసి ప్రయాణిస్తున్న చిన్నారి గమ్యస్థలం రాగానే వారితో పాటు దిగేందుకు రెడీ అయ్యింది. అయితే అంతకుమందు వరకు బస్సులో పెట్టిన పాటపై డాన్స్ చేయాలని కోరిక మాత్రం చిన్నారిలో కలిగింది.
దీంతో నేరుగా ఆ చిన్నారి మాత్రం నేరుగా డ్రైవర్ దగ్గరకు వెళ్లి ముచ్చటించింది. అప్పటికే అతను మరో ట్రిప్పు వేయడం కోసం సిద్ధం కావాల్సి ఉంది. కానీ అతను ఎలాంటి చిరాకు ప్రదర్శించకుండా ఆమెతో ముచ్చట్లాడాడు. ఇక పాప తనకు అంతకుముందు పెట్టిన టైలర్ స్విఫ్ట్ పాడిన ‘షేక్ ఇట్ ఆఫ్’ పాటంటే ఎంతో ఇష్టమని చెప్పింది. వెంటనే ఆయన అవునా! అయితే మనిద్దరం ఇప్పుడా పాటకు డ్యాన్స్ చేద్దాం అంటూ మరోమారు ఆ పాటను ప్లే చేశాడు. అది ఎంతలా అంటే రోడ్డుపై బస్సును నిలిపి ఫుల్ సౌండ్ పెట్టి మరీ చిన్నారిని సంతోషపెట్టాడు.
అంతటితో చిన్నారి సంతోషిస్తుండగానే అతను తన సీట్లోనే కూర్చోని స్టెప్పులేయం ప్రారంభించాడు. దీంతొ ఆ చిన్నారి సంతోషంతో గెంతులు వేస్తూ పాటకు తగ్గట్టుగా కాలు కదిపింది. ఇక బస్సు డ్రైవర్ సీటు బెల్టు కూడా తీయకుండా కూర్చున్న సీటులో నుంచే డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇది సరిగ్గా వాలెంటైన్స్ డే రోజునే జరిగింది. ప్రేమ, ప్రేమికుల రోజు అంటూ యూత్ అంతా అమ్మాయిల వెంట పరిగెడితే.. ఓ చిన్నారి ప్రేమను మాత్రం ఈ బస్సు డ్రైవర్ గెలుచుకున్నాడని నెటిజనులు మాత్రం ప్రశంసలు కురిపించారు.
ఇదంతా 2018 నాటి సంగతి కాగా దీనికి సంబంధించిన వీడియోను 11 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. తాజాగా రెక్స్ చాప్మన్ అనే వ్యక్తి ఈ వీడియోను తిరిగి పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే దీన్ని వీక్షించిన వారి సంఖ్య 8 మిలియన్ల మార్క్‌ను దాటి ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ‘నాకంటే బాగా డ్యాన్స్ చేశాడు, సీటుబెల్టు ధరించి కూర్చున్న చోట నుంచే ఆడిపాడాడు’, ‘బెస్ట్ చెయిర్ డ్యాన్సింగ్ అవార్డు ఇవ్వాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇలాంటి ప్రేమే కావాలి, ప్రపంచమంతా దానితో నిండిపోవాలి’, ‘ఇది కదా మాక్కావాల్సింది..’ అంటూ కొంతమంది మీమ్స్ ద్వారా రిప్లై ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more