యావత్ ప్రపంచాన్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్.. వ్యాప్తి చెందకుండా చక్కని తరుణోఫాయన్ని చెప్పారు బీజేపి ఎమ్మెల్యే. అంటార్టికా ఖండం తప్ప.. మిగత ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ పై అమె అభిప్రాయాలను స్వయంగా రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో వ్యక్తం చేశారు. అమె వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారం గోమూత్రం, గోవు పేడ.. ఈ రెండుంటితో కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా చేయవచ్చునని అమె అభిప్రాయపడ్డారు.
అవు మూత్రం, ఆవు పేడతో రెండింటితో భయంకరమైన క్యాన్సర్ వ్యాధులనే నశింపజేయవచ్చునని.. అలాంటిది ఈ రెండింటితో వైరస్ వ్యాధుల వ్యాప్తికి కూడా చెక్ పెట్టవచ్చునని అమె అభిప్రాయపడ్డారు. ఆవుకు చెందిన పంచకాలు అన్నీ వేడిని రగల్చుతాయని, ఈ వేడితోనే భయంకరమైన వ్యాధులు సోకకుండా, వ్యాప్తి చెందకుండా వుంటాయని అన్నారు. గోమూత్రం చల్లితే ఆ ప్రాంతం ఎలా శుభ్రపడుతుందో అందరికీ తెలుసని, కరోనా వైరస్ పై కూడా గోమూత్రం, పేడ ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు.
ఇక ఈ సందర్భంగా సుమన్ హరిప్రియ మాట్లాడుతూ మన ఆవులను పొరుగునే వున్న కొనుగోలు చేస్తున్న బంగ్లాదేశ్ మన దేశం నుంచి ఆవులను అక్రమంగా తరలించుకుపోతోందని అన్నారు. మన ఆవులను మాంసం కోసం తీసుకెళుతూ బంగ్లాదేశ్ ఆర్థికంగా ఎంతో బలపడిందని చెప్పారు. ఇవాళ ప్రపంచంలోనే పశుమాంసం ఎగుమతిదారుల్లో బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉందని వివరించారు. వారు వధిస్తున్న ఆవులన్నీ మనవేనని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more