దేశరాజధాని ఢిల్లీలోని పుర వీధుల్లో కదులుతున్న బస్సులో ఓ అమాయక అడపడచుపై జరిగిన దారుణఘాతుకం.. యావత్ దేశాన్ని కదిలించింది. ఏడేళ్ల కిత్రం జరిగిన ఈ హత్యాచార కాండపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు పెల్లుబిక్కాయి. దీంతో కొత్త చట్టాలు, అత్యాచార కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా వచ్చాయి. ఈ కోర్టుల్లో కేసుల విచారణ జరగి.. నిందితులను దోషులుగా ప్రకటించడంతో శిక్షలను కూడా న్యాయస్థానం వెలువరించగా, అవి అముల కూడా జరుగుతున్నాయి. అయినా.. నిర్భయ కేసులోని దోషులు మాత్రం చట్టంలోని లోసుగులను వెతుకుతూ తప్పించుకునే చర్యలే చేస్తున్నారు.
ఈ కేసులో నలుగురు దోషులు అన్ని న్యాయపరమైన హక్కులను వినియోగించుకున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా వేసిన క్యురేటివ్ పిటిషన్ ను ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. వెనువెంటనే రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటీషన్ పెట్టుకున్నాడు. కాగా మరోమారు రాష్ట్రపతి క్షమాబిక్ష పిటీషన్ ను దోషి పవన్ సర్వోన్నత న్యాయస్థానంలో రివ్యూకు దాఖలు చేయవచ్చు. అయితే ఇదే తరహాలో వినయ్ శర్మ కూడా రాష్ట్రపతి క్షమాబిక్ష పిటీషన్ పై.. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటీషన్ దాఖలు చేసినా.. అందులో కొత్తదనమేమీ లేదని న్యాయస్థానం కొట్టివేసింది.
అత్యున్నత న్యాయస్థానం ఆ తీర్పును పరిగణలోకి తీసుకుని పవన్ గుప్తా మరో న్యాయపరమైన అవకాశాన్ని వినియోగించుకోకుండా వుంటారా.? లేక తన పిటీషన్ ను కాసింత మెరుగ్గా దాఖలు చేస్తారా.? అన్న విషయాన్ని వేచిచూడాల్సిందే. ఇక న్యాయవిభాగంలోని లోసుగులను వినియోగించుకుంటూ శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని, ఇలా చేస్తే దేశప్రజలకు న్యాయంపై విశ్వాసం సన్నగిల్లుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి ఇటీవల మూడో పర్యాయం న్యాయస్థానం.. డెత్ వారెంట్ పై స్టే విధించిన సందర్భంగా అమె వ్యాఖ్యలు చేశారు. కోర్టు హాలులోనే కుప్పకూలిన ఆమె రోదిస్తూ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కాగా, తాజా పరిణామాలపై నిర్భయ తండ్రి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మిగతా దోషుల్లాగానే.. ఈ దోషికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరిణించారు. ఇక ఈ నిర్ణయాన్ని దోషి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఈ నెలలోనే వారికి ఉరి శిక్ష అమలవుతుందని ఆశిస్తున్నాం. చాలా కాలం వేచి ఉన్న తర్వాత అయినా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం” అని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more