తమ వద్ద క్యాబ్ లను రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. మీ కారు డబ్బులను కేవలం రెండు సంవత్సరాల్లో తీర్చుకోవడంతో పాటు మీ నెలవారి ఖర్చులు కూడా మిగిలిపోతాయని ఒకరు.. నెలకు లక్ష వరకు అర్జించవచ్చునని మరోకరు ఇలా పోటీ ప్రపంచంలో తమకు ప్రచారమే అత్యుత్తమ ఆయుదంగా మలుచుకుంటారు. దీంతో నిరుద్యోగ యువత అప్పులు చేసి మరీ కార్లు కోని గిరాకీల కోసం నిద్రలేని రాత్రులు గడువుతున్నారు. ఆదమరిస్తే నెలసరి వాయిదా కట్టాలని బ్యాంకులో లేక రుణాలిచ్చిన సంస్థలో, వ్యక్తులో ఇళ్లపైకి వస్తారని విషయం తెలిసిందే.
ఇలా తన కారుకు గిరాకీ వచ్చిందని సంతోషం కూడా లేకుండా ఓ క్యాబ్ డ్రైవర్ చేసిన నిర్వాకం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకీ ఎంచేశాడని అంటారా.. క్షేమంగా గమ్యస్థానం చేర్చాల్సిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో జోగుతుండడమేకాక, ప్రమాదం అంచు వరకు తీసుకువెళ్లడంతో ఆశ్చర్యపోయిన మహిళ తానే కారు నడుపుతూ గమ్యస్థానం చేరుకున్న ఘటన ఇది. డ్రైవర్ నిర్వాకంపై ఆమె వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా ఇప్పుడిది వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళితే...గతనెల ఇరవై ఒకటో తేదీన తేజస్విని దివ్యనాయక్ (28) అనే మహిళ పుణె నుంచి ముంబయి వచ్చేందుకు ఊబర్లో క్యాబ్ బుక్ చేసింది. కారు ఎక్కిన ఆమె డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతుండడంతో మందలించింది. ఫోన్ పక్కన పెట్టేసిన డ్రైవర్ కారు నడుపుతూ నిద్రలోకి జారుకుంటూ ఉండడాన్ని ఆమె గమనించింది. దీంతో ఆందోళన చెందిన ఆమె అతన్ని అప్రమత్తం చేద్దామనేలోపే కారు డివైడర్ను మెల్లగా డీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఇద్దరికీ ఏమీ కాలేదు.
దీంతో పరిస్థితిని ఊహించిన ఆమె డ్రైవర్ను వెనుక సీట్లో కాసేపు పడుకోవాలని చెప్పి తానే స్టీరింగ్ చేతుల్లోకి తీసుకుంది. ముంబయి వచ్చేలోగా డ్రైవర్ పడుకోవడాన్ని వీడియోతీసి ఊబర్ సంస్థకు పంపడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ వైరల్గా మారింది. మరోవైపు వీడియో చూసిన ఊబర్ సంస్థ సదరు డ్రైవర్ను విధుల్లోంచి తొలగించినట్లు ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more